Valimai Trailer: ఫ్యాన్స్‌కు అజిత్ న్యూఇయర్ గిఫ్ట్.. ‘వాలిమై’ ట్రైలర్ అదుర్స్.. మరో హిట్ లోడింగ్..!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో దర్శకుడు హెచ్. వినోద్ తెరకెక్కించిన చిత్రం 'వాలిమై'. టాలీవుడ్ యువ హీరో కార్తికేయ
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో దర్శకుడు హెచ్. వినోద్ తెరకెక్కించిన చిత్రం ‘వాలిమై’. టాలీవుడ్ యువ హీరో కార్తికేయ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను అజిత్ ప్రకటించిన దగ్గర నుంచి తమిళ అభిమానులు మాత్రమే కాదు ఇతర భాషలలోని అజిత్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల రిలీజైన గ్లింమ్స్, పోస్టర్స్ మూవీపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇదిలా ఉంటే.. తాజాగా చిత్ర యూనిట్ వాలిమై ట్రైలర్ రిలీజ్ చేసింది.
ట్రైలర్ విషయానికి వస్తే.. మొదటి నుంచి చివరి వరకు ప్రతీ ఫ్రేమ్ అజిత్ అభిమానులకు ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా అజిత్, కార్తికేయ బైక్ స్టంట్స్ వేరే లెవెల్. ఇక యువన్ శంకర్ రాజా బ్యాగ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు సరిగ్గా సరిపోయింది. ‘వివేగం’ సినిమా తర్వాత మరోసారి స్టైలిష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అజిత్ కుమార్ కనిపిస్తున్నారు. ఇక బాలీవుడ్ బ్యూటీ హుమా కురేషి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. కాగా, ఈ మూవీని బోణీ కపూర్, జీ స్టూడియోస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మోస్ట్ వాంటెడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ‘వాలిమై’ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషల్లో కూడా డబ్ చేయనున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా వాలిమై ట్రైలర్ చూసేయ్యండి.
Year Ender 2021: ఈ ఏడాది దుమ్మురేపిన మాస్ మసాలా సాంగ్స్.. ఊ అంటావా అంటూ.. ప్రేక్షకులను ఊపేశాయి..