Vakeel Saab: అర్థరాత్రి పవన్ అభిమానుల వీరంగం… థియేటర్‌పై రాళ్లదాడి.. కారణమేంటో తెలుసా?
Vakeel Saab: 'అజ్ఞాతవాసి' తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవర్ స్టార్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా 'వకీల్‌సాబ్'. ప్రపంచవ్యాప్తంగా సుమారు 700కు పైగా థియేటర్లలో ఈరోజు...
Vakeel Saab: ‘అజ్ఞాతవాసి’ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవర్ స్టార్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ‘వకీల్‌సాబ్’. ప్రపంచవ్యాప్తంగా సుమారు 700కు పైగా థియేటర్లలో ఈరోజు (ఏప్రిల్ 9) విడుదలువతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. పవర్ స్టార్ రీ ఎంట్రీగా వస్తోన్న సినిమా కావడంతో ఎక్కడ చూసినా ‘వకీల్‌సాబ్’ మ్యానియా కనిపిస్తోంది. కరోనా తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో విడుదలవుతోన్న భారీ చిత్రం ఇదే కావడం విశేషం. ఈ క్రమంలోనే పవన్ అభిమానుల కోసం శుక్రవారం బెనిఫిట్ షోలు ఏర్పాటు చేశారు. దీంతో ఇప్పటికే పలు చోట్ల బెనిఫిట్ షోలను కూడా ఏర్పాటు చేశారు. అయితే తిరుపతిలో శుక్రవారం రాత్రి నిర్వహించాల్సిన బెనిఫిట్ షోను రద్దు చేశారు. దీంతో పవన్ అభిమానులు వీరంగం సృష్టించారు. అర్థరాత్రి థియేటర్ ముందు హల్‌చల్ చేశారు. బెనిఫిట్ షో నిర్వహించకపోవడంతో తిరుపతిలోని శాంతి థియేటర్‌పై రాళ్లతో దాడికి దిగారు. దీంతో థియేటర్ వద్ద అర్థరాత్రి గందరగోళం నెలకొంది. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఫ్యాన్స్‌ను అక్కడి నుంచి చెదరగొట్టారు.
థియేటర్ వద్ద పవన్ అభిమానుల హల్చల్..
Also Read: ఏబీ డివిలియర్స్ స్టైల్‌కి ఫిదా అయిన బాలీవుడ్ యంగ్ హీరో భార్య..! అభిమానులకు షాకింగ్ రిప్లై..
సూసైడ్ అటెంప్ట్ చేసిన బిగ్‌బాస్ కంటెస్టెంట్.. హస్పిటల్ బెడ్ పై అలా.. సోషల్ మీడియాలో ఫోటోస్ వైరల్..