AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shah Rukh Khan: షారుక్ ఖాన్ నిజంగా ఆపని చేశాడా..? ఆగ్రహం వ్యక్తం చేసిన నటి ఊర్మిళ

తన గాత్రంలో కోట్లాదిమంది మనసులను కొల్లగొట్టిన గానా కోకిల లతామంగేష్కర్. ఆమె సినిమా పాటల ప్రపంచాన్ని ఒక మహారాణిలా ఏలారు.

Shah Rukh Khan: షారుక్ ఖాన్ నిజంగా ఆపని చేశాడా..? ఆగ్రహం వ్యక్తం చేసిన నటి ఊర్మిళ
Urmila Matondkar
Rajeev Rayala
| Edited By: Anil kumar poka|

Updated on: Feb 08, 2022 | 4:57 PM

Share

Shah Rukh Khan: తన గాత్రంలో కోట్లాదిమంది మనసులను కొల్లగొట్టిన గాన కోకిల లతామంగేష్కర్. ఆమె సినిమా పాటల ప్రపంచాన్ని ఒక మహారాణిలా ఏలారు. చివరిగా ఆ గొంతు కూడా ఇప్పుడు మూగబోయింది. ఓ అమృత గళం దివికేగిపోయింది. 90 ఏళ్ళ వయసులో కూడా ఆర్మీ జవాన్ల కోసం వీసమెత్తు వృద్ధఛాయలు కానరానీయకుండా, అదే మాధుర్యంతో, చివరి పాట పాడిన ఆ గొంతు ఇప్పుడు సంగీత ప్రియుల్ని విషాదంలోకి నెట్టి ఈ లోకాన్ని వీడిపోయింది. లతా మంగేష్కర్(92) (Lata Mangeshkar) న్యూమోనియాతో పాటు, కరోనా సోకడంతో ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో చేరారు. తొలుత కరోనా నుంచి కోలుకున్నప్పటికీ.. ఆ తరువాత ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. శరీరంలోని అవయవాలు ఒక్కొక్కటిగా వైఫల్యం చెందడం మొదలైంది. ఆమెకు వైద్యం అందించిన డాక్టర్ ప్రతీత్ సమదానీ..ఆదివారం ఉదయం 06.30 గంటలకు ఆమె కన్నుమూశారంటూ వెల్లడించారు. దాంతో ఒక్కసారిగా సంగీత ప్రేమికుల గుండె పగిలినంత పనైంది.

లతా మంగేష్కర్ భౌతికకాయాన్ని ఆదివారం మధ్యాహ్నం ముంబైలోని పెద్దార్ రోడ్‌లో గల ఆమె నివాసం ‘ప్రభుకుంజ్’కి తీసుకొచ్చారు. ఆతర్వాత అదే రోజు సాయంత్రం 6.30 గంటలకు ముంబైలోని శివాజీ పార్క్‌లో ప్రభుత్వ లాంఛనాలతో లతా మంగేష్కర్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. లతాజీ అంత్యక్రియలకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. షారుఖ్‌ తన మేనేజర్‌ పూజా దద్లానీతో కలిసి లతాజీ పార్థివ దేహానికి నివాళి అర్పించారు. లెజెండరీ సింగర్‌ పాదాలను తాకి ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. అయితే షారుఖ్‌ నివాళికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లతాజీకి నివాళి అర్పించే క్రమంలో షారుఖ్‌ ఖాన్‌ ఇస్లాం సంప్రదాయం ప్రకారం చేతులు జోడించి అల్లాకు దువా చేస్తూ కనిపించగా.. ఆయనే పక్కన నిల్చున్న మేనేజర్‌ పూజా దద్లాని హిందూ సంప్రదాయ ప్రకారం నమస్కరిస్తూ ప్రార్థనలు చేస్తూ కనిపించారు. అయితే చివరిలో లతాజీ భౌతికకాయం పై షారుక్ ఊదాడు. అది ప్రార్ధనలో ఒక భాగం. అది తెలియక లతాజీ పాదాల వద్ద షారుక్ ఉమ్మేశారని కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీనిపై నటి ఊర్మిళ స్పందించారు. తన పై వస్తున్న కామెంట్స్ పై షారుక్ రియాక్ట్ అవ్వకపోయినా నటి ఊర్మిళ మాత్రం కొంచం ఘాటుగానే స్పందించారు. ప్రార్ధన ను కూడా ఉమ్మువేయడం అనుకునే సమాజంలో మనం బ్రతుకుతున్నాం అని ఆమె మండిపడ్డారు. ఇండియన్ సినిమాను అంతర్జాతీయ ఫార్మేట్ లో నిలబెట్టిన షారుక్ గురించి ఇలా నెగిటివ్ కామెంట్స్ చేయడం బాధాకరం అని ఆమె పేర్కొన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nora Fatehi: పుట్టినరోజున అదిరిపోయే బహుమతి అందించిన అభిమానులు.. భావోద్వేగానికి గురైన బాలీవుడ్‌ బ్యూటీ..

Shanmukh Jaswanth: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన యూట్యూబ్‌ స్టార్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోలు..

AP High Court: థియేటర్లను సీజ్ చేయడంపై ఏపీ హైకోర్ట్ ఆగ్రహం.. ఆ అధికారం వారికి లేదంటూ..