Rajinikanth: సూపర్ స్టార్ 170 కోసం పోటీ పడుతున్న ఆ ఇద్దరు స్టార్ దర్శకులు..

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రీసెంట్ గా అన్నత్తే  సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సూపర్ స్టార్ ఈ సినిమా మంచి విజయన్ని అందుకుంది.

Rajinikanth: సూపర్ స్టార్ 170 కోసం పోటీ పడుతున్న ఆ ఇద్దరు స్టార్ దర్శకులు..
Rajinikanth
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 08, 2022 | 3:39 PM

Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రీసెంట్ గా అన్నత్తే  సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సూపర్ స్టార్ ఈ సినిమా మంచి విజయన్ని అందుకుంది. తెలుగులో ఈ సినిమా పెద్దన్నగా విడుదలైంది. ఇక్కడ కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా.. అన్నత్తే  కోలీవుడ్ బాక్సాఫీస్ నే 200 కోట్ల వసూళ్లతో షేక్ చేసింది. ఈ సినిమాతరువాత  సూపర్ స్టార్ మరో సినిమాను అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు సూపర్ స్టార్ నెక్స్ట్ సినిమా గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది. అయితే యాక్షన్ శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రజనీ రెడీ అయ్యారని తెలుస్తుంది. ఇది రజనీకాంత్ 168వ సినిమా. ఈ సినిమా తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 169వ చిత్రాన్ని చేయనున్నారట. నెల్సన్ ప్రస్తుతం దళపతి విజయ్ తో బీస్ట్ సినిమా చేస్తున్నారు. రజినీకాంత్ నెల్సన్ సినిమాను వేసవిలో ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే రజినీకాంత్ 170 సినిమా కోసం ఇప్పుడు దర్శకులు పోటీ పడుతున్నారని తెలుస్తుంది. రజిని 170 సినిమా కోసం ఏకంగా ఇద్దరు దర్శకులు పోటీ పడుతున్నారు. అందులో ఒకరు లోకేష్ కనగరాజ్ ఉన్నారట. అలాగే రజిని `కబాలి`..`కాలా` సినిమాలు చేసిన రంజిత్ కూడా రజినీతో సినిమా చేయాలనీ ట్రై చేస్తున్నారట. ఈ రెండు సినిమాల్లో కబాలి పర్లేదు అనిపించుకున్న కాలా సినిమా మాత్రం బెడిసికొట్టింది. మరి ఈ ఇద్దరిలో రజినీకాంత్ ఎవరికీ ఛాన్స్ ఇస్తారో చూడాలి. త్వరలోనే  రజిని 170 సినిమా అనౌన్స్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. చూడాలి మరి ఎం జరుగుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nora Fatehi: పుట్టినరోజున అదిరిపోయే బహుమతి అందించిన అభిమానులు.. భావోద్వేగానికి గురైన బాలీవుడ్‌ బ్యూటీ..

Shanmukh Jaswanth: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన యూట్యూబ్‌ స్టార్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోలు..

AP High Court: థియేటర్లను సీజ్ చేయడంపై ఏపీ హైకోర్ట్ ఆగ్రహం.. ఆ అధికారం వారికి లేదంటూ..