Krithi Shetty : బాలీవుడ్‌లోకి సాలిడ్ ఎంట్రీ ఇస్తున్న ఉప్పెన బ్యూటీ.. అమ్మడి అదృష్టం అక్కడ ఎలా ఉంటుందో..
కృతి శెట్టి ఉప్పెన సినిమా తర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంది. ఉప్పెన తర్వాత నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా హిట్ అయ్యింది. ఆ తర్వాత నాగ చైతన్య, నాగార్జున కలిసి నటించిన బంగార్రాజు సినిమాతో మరో హిట్ అందుకుంది.
టాలీవుడ్ లో ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మల్లో కృతిశెట్టి ఒకరు. ఉప్పెన సినిమాతో పరిచయమైన ఈ అమ్మడు. ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందమైన లుక్స్, ఆకట్టుకునే అభినయంతో మంచి మార్కులు కొట్టేసింది ఈ భామ. కృతి శెట్టి ఉప్పెన సినిమా తర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంది. ఉప్పెన తర్వాత నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా హిట్ అయ్యింది. ఆ తర్వాత నాగ చైతన్య, నాగార్జున కలిసి నటించిన బంగార్రాజు సినిమాతో మరో హిట్ అందుకుంది. ఆతర్వాత వరసబెట్టి ఫ్లాప్స్ పడ్డాయి. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ పడ్డాయి. దాంతో ఈ చిన్నది స్పీడ్ తగ్గించింది. ఇదిలా ఉంటే రీసెంట్ గా మలయాళంలో ఓ సినిమా చేసింది ఈ బ్యూటీ.
ఇక టాలీవుడ్‌లో చాలా మంది ముద్దుగుమ్మలు బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడు ఈ కోవలోకి ఈ బ్యూటీ కూడా చేరిపోయింది. మంగళూరు భామ కృతి శెట్టి ఇప్పుడు బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. కృతి శెట్టి పెరిగింది ముంబైలోనే ..కృతి తండ్రి ముంబైలో వ్యాపారవేత్త అలాగే ఆమె తల్లి ఫ్యాషన్ డిజైనర్. చిన్నప్పటి నుంచి డ్యాన్స్, డ్రామాపై ఆసక్తి ఉన్న కృతి శెట్టి కాలేజీలో అడుగుపెట్టే సమయంలో కొన్ని వాణిజ్య ప్రకటనల్లో నటించింది. అంతే కాకుండా హృతిక్ రోషన్ నటించిన ‘సూపర్ 30’ సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది.
తెలుగులో ‘ఉప్పెన’ సినిమా ద్వారానే హీరోయిన్‌గా పరిచయమైంది. 2021లో విడుదలైన ‘ఉప్పెన బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. నేచురల్ స్టార్ నాని, నాగ చైతన్య, నితిన్, రామ్ పోతినేని మరికొందరు స్టార్ నటులతో సినిమాలు చేసింది. ఇప్పుడు కూడా కృతి చేతిలో ఒక మలయాళం, మూడు తమిళ సినిమాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే కృతి బాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. కృతి శెట్టి, వరుణ్ ధావన్ జంటగా నటిస్తున్న కొత్త చిత్రం. వరుణ్ ధావన్ కొత్త సినిమాకు అతని తండ్రి డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్నాడు., ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తోంది. బాలీవుడ్‌లో కృతి శెట్టి అరంగేట్రం గురించి వార్తలు రావడంతోపాటు కృతి ఈ మధ్య ముంబైలో కూడా కనిపించింది. కృతి, వరుణ్ ధావన్ ల కొత్త సినిమా ముహూర్తం త్వరలో జరుగుతుందని అంటున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి