Krithi shetty: అందాల కృతి అద్భుత టాలెంట్.. ‘బేబమ్మ’ క్లాసికల్ డ్యాన్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Krithi Shetty Dance Video: 'ఉప్పెన' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార కృతి శెట్టి. ఈ సినిమా విజయంలో దర్శకుడు, హీరో పాత్ర ఎంత ఉందో హీరోయిన్ కృతి శెట్టి పాత్ర కూడా అంతే...
Krithi Shetty Dance Video: ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార కృతి శెట్టి. ఈ సినిమా విజయంలో దర్శకుడు, హీరో పాత్ర ఎంత ఉందో హీరోయిన్ కృతి శెట్టి పాత్ర కూడా అంతే ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. తన అమాయక చూపులు, అందంతో అట్రాక్ట్ చేస్తూనే ఎమోషన్‌తో కూడిన నటనతో ఆకట్టుకుందీ బ్యూటీ. ఇక కేవలం అందం, నటనతోనే కాకుండా డ్యాన్స్‌తోనూ ఆకట్టుకుందీ అందాల తార. సినిమాలో పెద్దగా డ్యాన్స్‌కు స్కోప్ లేకపోయినప్పటికీ తాజాగా విడుదల చేసిన ఓ పాటలో తనలోని ట్యాలెంట్‌ను చూపించింది. ఉప్పెన సినిమాలో హీరో, హీరోయిన్లు కష్టాల్లో ఉండే సమయంలో వచ్చే ‘ఈశ్వరా.. పరమేశ్వరా’ అంటూ సాగే పాట శ్రోతలను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ పాటకు హీరోయిన్ కృతి శెట్టి.. డ్యాన్స్ చేసింది. నరక్తిగా మారి ఆ పాటకు నాట్యం చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పాటకు తగ్గట్లు కాలు కదపడంతో పాటు.. మొహంలో హవభావాలను పలకరించిన తీరు ఆకట్టుకుంటుంది. కృతి శెట్టి అద్భుత డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
ఇదిలా ఉంటే ఉప్పెన సినిమా విజయంతో కృతి శెట్టికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. తొలి సినిమాతోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఈ చిన్నది వరుస ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకెళుతోంది. ఈ క్రమంలో సుధీర్ బాబు, నానితో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఇక బాలీవుడ్‌లో తెరకెక్కనున్న ఉప్పెన రీమేక్‌లోనూ నటించే అవకాశాన్ని సొంతం చేసుకుందీ బ్యూటీ.
Also Read: స్కూల్ లైఫ్‌లో తమన్నా మా సీనియర్.. అయితే ఆమె అందం గురించి బుట్టబొమ్మ ఏం కామెంట్ చేసిందంటే..?