Suriya: టాలీవుడ్ డైరెక్టర్‌తో సూర్య.. హీరోయిన్స్‌గా ఇద్దరు హాట్ బ్యూటీలు
సౌత్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలలో సూర్య ఒకరు. ఇటీవలే కంగువ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్. కానీ అతడి పేరును డైరెక్టర్ మణిరత్నం సూర్యగా మార్చారు.

స్టార్ హీరో సూర్య చివరిగా కంగువ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా నిరాశపరచడంతో అభిమానులు ఇప్పుడు సూర్య నెక్స్ట్ సినిమా పై అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం సూర్య ‘రెట్రో’, సూర్య 45 సినిమాలకు కమిట్ అయ్యాడు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రెట్రో’. ఈ చిత్రంలో ఆయన సరసన టాలీవుడ్ హిట్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మే 1, 2025న విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత, ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య 45వ సినిమా భారీ స్థాయిలో నిర్మాణంలో ఉంది.
ఇది కూడా చదవండి :ఎన్టీఆర్ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన చిట్టి.. ఫరియా అబ్దుల్లా అదరగొట్టిందిగా..
ఈ సినిమాలో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడని కూడా తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ నవంబర్ 2024లో ప్రారంభమైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్స్ సిటీలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తర్వాత సూర్య వాడివాసల్ సినిమాలో నటించనున్నట్లు చెబుతున్నారు. అలాగే సూర్య టాలీవుడ్ లోకి అడుగుపెట్టనున్నాడని తెలుస్తుంది.
ఇది కూడా చదవండి: ఈమెను మించిన హాట్ బ్యూటీ ఉంటుందా..! చేసింది రెండు సినిమాలు.. ఒకొక్క మూవీకి అందుకుంటుంది రూ.3 కోట్లు
టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది.అయితే ఈ సినిమా గురించిన ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతుంది. సూర్యతో పాటు ఇద్దరు హీరోయిన్లు ఈ చిత్రంలో నటించనున్నట్లు పేర్కొంటూ కొత్త అప్‌డేట్ విడుదలైంది. హీరోయిన్లు నటి భాగ్యశ్రీ, నిధి అగర్వాల్ ఈ సినిమాలో నటిస్తున్నారని. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వచ్చిన సార్, లక్కీ భాస్కర్ సినిమాలు మంచి విజయం సాధించాయి. కాగా ఇప్పుడు సూర్యతో వెంకీ సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గురించి అప్డేట్స్ బయటకు రానున్నాయి.
ఇది కూడా చదవండి: ప్రేమించినవాడి కోసం మతం మార్చుకుంది.. పేరు మార్చుకుంది.. చివరకు ఇలా
View this post on Instagram
భాగ్య శ్రీ ఇన్ స్టా గ్రామ్ ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..