AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nabha Natesh: లైన్ దాటొద్దు..! మాటలు జాగ్రత్త..!! నభా నటేష్‌కు ఇచ్చిపడేసిన ప్రియదర్శి

పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇష్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో తన నటనతో పాటు అందంతో ఆకట్టుకుంది ఈ చిన్నది. ఈ సినిమాలో తన అందాలతో కుర్రకారు మతిపోగొట్టింది నభనటేష్. ఈ సినిమా తర్వాత మరో హిట్ అందుకోలేకపోయింది. ఆతర్వాత సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చింది.

Nabha Natesh: లైన్ దాటొద్దు..! మాటలు జాగ్రత్త..!! నభా నటేష్‌కు ఇచ్చిపడేసిన ప్రియదర్శి
Darling Movie
Rajeev Rayala
|

Updated on: Apr 18, 2024 | 11:17 AM

Share

నభా నటేష్.. ఈ ముద్దగుమ్మ తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరేమో.. నన్నుదోచుకుందువటే అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ వయ్యారి భామ. ఆ తర్వాత వరుసగా ఒకటి రెండు సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేక పోయింది. ఆ తర్వాత పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇష్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో తన నటనతో పాటు అందంతో ఆకట్టుకుంది ఈ చిన్నది. ఈ సినిమాలో తన అందాలతో కుర్రకారు మతిపోగొట్టింది నభనటేష్. ఈ సినిమా తర్వాత మరో హిట్ అందుకోలేకపోయింది. ఆతర్వాత సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీగా మారనుంది ఈ అమ్మడు.

నభా నటేష్ ఆ మధ్య చిన్న ప్రమాదానికి గురియైంది.. దాంతో ఆమె సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం  యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను  ఆకట్టుకుంటుంది. అలాగే అందాలు కూడా ఆరబోస్తూ కవ్విస్తుంది. ఇప్పుడు నిఖిల్ తో ఓ సినిమా చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిన్నదానికి టాలీవుడ్ హీరోకు మధ్య ట్విట్టర్ వార్ జరిగింది. తాజాగా ట్విట్టర్ లో నభా నటేష్ డార్లింగ్ అంటూ ఓ వీడియోను షేర్ చేసింది.

దీని పై టాలీవుడ్ నటుడు ప్రియదర్శి స్పందిస్తూ.. వావ్ సూపర్ డార్లింగ్.. కిరాక్‌ ఉన్నావ్ డార్లింగ్.. అని రాసుకొచ్చారు. దాంతో నభనటేష్ రెచ్చిపోయింది. మిస్టర్ కామెంట్‌ చేసేముందు మాటలు జాగ్రత్త అంటూ ఓ వీడియో క్లిప్ ను షేర్ చేసింది. గతంలో డార్లింగ్ అంటే లైంగిన వేధింపుల కిందకు వస్తుందని కలకత్తా కోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్నీ గుర్తు చేస్తూ పోస్ట్ పెట్టింది నభానటేష్..  దాంతో మనోడు ఎక్కడా తగ్గకుండా .. మీరేమో డార్లింగ్‌ అని పిలవొచ్చు.. మేము పిలిస్తే ఐపీసీ సెక్షన్‌ పెడతారా? లైట్ తీస్కో డార్లింగ్‌ అని కామెంట్ చేశాడు. దానికి లైన్ క్రాస్ అవ్వొద్దు చూసుకుందాం అని రిప్లే ఇచ్చింది నభా .. దాని వై దిస్ కొలవెరి అంటూ ఫన్నీగా రిప్లే ఇచ్చాడు ప్రియదర్శి. అయితే ఈ ట్విట్టర్ వార్ సరదాగా జరిగిందని తెలుస్తోంది. కావాలనే వీరు ఇలా ట్వీట్స్ చేసుకున్నారని అంటున్నారు నెటిజన్స్.

నభా నటేష్ ట్విట్టర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.