AaduJeevitham: 100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన తాజా చిత్రం ఆడు జీవితం,ది గోట్‌లైఫ్. సౌదీలో కూలీలు పడే కష్టాల ఇతి వృత్తంతో బ్లెస్సీ ఈ సినిమాను తెరకెక్కించాడు. అమలా పాల్ హీరోయిన్ గా నటించింది. మార్చి 28న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఏకంగా వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఆడు జీవితం కు పాజిటివ్ టాక్ వచ్చింది.
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన తాజా చిత్రం ఆడు జీవితం,ది గోట్‌లైఫ్. సౌదీలో కూలీలు పడే కష్టాల ఇతి వృత్తంతో బ్లెస్సీ ఈ సినిమాను తెరకెక్కించాడు. అమలా పాల్ హీరోయిన్ గా నటించింది. మార్చి 28న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఏకంగా వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఆడు జీవితం కు పాజిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమా కోసం పృథ్వీరాజ్ మారిపోయిన తీరు, నటన అందరినీ మెప్పించింది. తెలుగులో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేయడం విశేషం. ఇప్పటికీ చాలా చోట్ల థియేటర్లలో ఆడుతోన్న ఆడు జీవితం సినిమా ఓటీటీ రిలీజ్ గురించి సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ పృథ్వీరాజ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఇందుకోసం 30 కోట్ల డీల్ కుదిరినట్లు సమాచారం. ఈనేపథ్యంలో మే 10 నుంచి ఆడు జీవితం సినిమాను ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!