Vishal: సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ..?

Vishal: సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ..?

Anil kumar poka

|

Updated on: Apr 18, 2024 | 8:09 AM

కోలీవుడ్ హీరో విశాల్ నిత్యం ఏదోక విషయంతో వార్తలలో నిలుస్తుంటాడు. ఇన్నాళ్లు రత్నం సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఇక ఈమూవీ త్వరలోనే అడియన్స్ ముందుకు రాబోతుంది. ఇప్పుడిప్పుడే సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విశాల్ తమిళ్ ఇండస్ట్రీలోని ఉదయ నిధి స్టాలిన్ నిర్మాణ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మాటలతో సంచలనంగా మారారు.

కోలీవుడ్ హీరో విశాల్ నిత్యం ఏదోక విషయంతో వార్తలలో నిలుస్తుంటాడు. ఇన్నాళ్లు రత్నం సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఇక ఈమూవీ త్వరలోనే అడియన్స్ ముందుకు రాబోతుంది. ఇప్పుడిప్పుడే సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విశాల్ తమిళ్ ఇండస్ట్రీలోని ఉదయ నిధి స్టాలిన్ నిర్మాణ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మాటలతో సంచలనంగా మారారు. ఇంతకీ విశాల్ ఏమన్నారంటే.. “సినిమాను ఆపేద్దాం.. లేదా తర్వాత విడుదల చేద్ధాం అని చెప్పే అధికారం ఎవరికీ లేదు. తమిళ సినిమా నా చేతుల్లోనే ఉందని చెప్పుకునే వారికి విజయం సాధించినట్లు చరిత్రే లేదు. ఈ విషయం నేను నా కోసం చెప్పడం లేదు. నాలాంటి వాళ్లు డబ్బులు ధారపోసి.. ఎన్నో కష్టాలను ఎదుర్కొని.. చెమటొడ్చి సినిమా తీస్తుంటే.. కొందరు నిర్మాతలు మాత్రం ఏసీ రూంల్లో కూర్చొని ఆ సినిమా రిలీజ్ చేయకండి.. వాయిదా వేయండి అంటూ ఆదేశాలు ఇస్తున్నారు. 65 కోట్లు పెట్టి మార్క్ ఆంటోని సినిమాను నిర్మించి వినాయక చవితికి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ రిలీజ్ తేదీకి వారం రోజుల ముందు కాల్ చేసి థియేటర్స్ ఇవ్వలేమని చెప్పారు. రూ.50 కోట్లు పెట్టుబడి పెట్టిన నిర్మాత తన సినిమా విడుదల తేదీని నిర్ణయించకూడదా ?.. అసలు మీరెవరు ఈ సినిమా విడుదల చేయొద్దు అని చెప్పడానికి. మార్క్ ఆంటోని సినిమాకు ఎన్నో అడ్డంకులు పెట్టాలనుకున్నారు.. కానీ సినిమా మాకు లాభాలే తీసుకవచ్చింది.” సీరియస్ గా మాట్లాడారు విశాల్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!