Salman Khan: పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్ మిస్.! సల్మాన్ కేసులో మలుపు..
బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వెలువల జరిపిన కాల్పుల కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. కాల్పులు జరిపిన నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సూచనల మేరకే సల్మాన్ ఇంటిపై దుండగులిద్దరూ కాల్పులు జరిపినట్లు విచారణలో స్పష్టమైంది. లారెన్స్ గ్యాంగ్‌తో షూటర్ సాగర్ పాల్ కాంటాక్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత విక్కీ గుప్తా ఈ ముఠాలో చేరాడు.
బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వెలువల జరిపిన కాల్పుల కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. కాల్పులు జరిపిన నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సూచనల మేరకే సల్మాన్ ఇంటిపై దుండగులిద్దరూ కాల్పులు జరిపినట్లు విచారణలో స్పష్టమైంది. లారెన్స్ గ్యాంగ్‌తో షూటర్ సాగర్ పాల్ కాంటాక్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత విక్కీ గుప్తా ఈ ముఠాలో చేరాడు. షూటర్ సాగర్ పాల్ రెండేళ్లుగా హర్యానాలోనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే లారెన్స్ గ్యాంగ్‌కు దగ్గరయ్యాడు. తర్వాత రెండో నిందితుడు విక్కీ గుప్తా కూడా సాగర్‌తో దోస్తీ కట్టాడు. సల్మాన్‌పై దాడి చేసిన వీరిద్దరూ ఓ భారతీయ ఫోన్ నంబర్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఇప్పుడు ఆ ఫోన్ నంబర్‌పై కూడా విచారణ జరుగుతోంది. అది ఎవరి నంబర్ అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఏప్రిల్ 14న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. నేరం చేయడానికి ముందు, దాడికి పాల్పడిన వ్యక్తులు సల్మాన్ ఇంటి చుట్టూ మూడుసార్లు రెక్సీ నిర్వహించారు. దాడి అనంతరం నిందితులిద్దరినీ గుజరాత్‌లోని కచ్‌లో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు ఇద్దరూ బీహార్‌లోని చంపారన్ వాసులు. ఫిబ్రవరి 29 నుంచి మార్చి 1 మధ్య సల్మాన్ ఖాన్ ఇంటికి కేవలం ఒక కిలోమీటరు దూరంలో ఉన్న హోటల్ తాజ్ ల్యాండ్స్ ఎండ్ సమీపంలో దాడికి పాల్పడిన వ్యక్తులు కలుసుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

