Tv9 Top 9 ET: ఊర్వశివో రాక్షసివో అంటున్న అల్లువారబ్బాయి.. మళ్లీ కెమెరా ముందుకు రేణు దేశాయ్

పొలిటికల్ డైలాగులతో హీట్ పెంచేస్తున్నారు చిరంజీవి. ఎమ్మెల్యేలపై చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

Tv9 Top 9 ET: ఊర్వశివో రాక్షసివో అంటున్న అల్లువారబ్బాయి.. మళ్లీ కెమెరా ముందుకు రేణు దేశాయ్
Tollywood
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 30, 2022 | 8:41 AM

1.చిరంజీవి 

చిరంజీవి హీరోగా మోహన్ రాజా తెరకెక్కించిన పొలిటికల్ ఎంటర్‌టైనర్ గాడ్ ఫాదర్. ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. మరీ ముఖ్యంగా పొలిటికల్ డైలాగులతో హీట్ పెంచేస్తున్నారు చిరంజీవి. ఎమ్మెల్యేలపై చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ మాటలు రాసిన లక్ష్మీ భూపాల్‌కు థ్యాంక్స్ చెప్పారు మెగాస్టార్.

2. రేణు దేశాయ్ రేణు దేశాయ్ రీ ఎంట్రీ గురించి కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. రవితేజ హీరోగా వంశీ తెరకెక్కిస్తున్న టైగర్ నాగేశ్వరరావుతో రేణు రీ ఎంట్రీ ఖరారైపోయింది. 18 ఏళ్ళ తర్వాత ఈమె స్క్రీన్ మీద కనిపించబోతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హేమలత లవణం పాత్రలో నటిస్తున్నారు రేణు దేశాయ్. దీనికి సంబంధించిన అఫీషియల్ వీడియో విడుదల చేసారు మేకర్స్.

ఇవి కూడా చదవండి

3. జిన్నా  మంచు విష్ణు హీరోగా ఇషాన్ సూర్య తెరకెక్కిస్తున్న సినిమా జిన్నా. ఈ చిత్ర ట్రైలర్‌తో పాటు సినిమా విడుదల డేట్‌ను అధికారికంగా అనౌన్స్ చేసారు మంచు విష్ణు. దసరా సందర్బంగా ట్రైలర్‌ను అక్టోబర్ 5న.. సినిమాను 21న విడుదల చేయబోతున్నట్లు తెలిపారు ఈయన. పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

4. కృష్ణం రాజు  సెప్టెంబర్ 11న మాజీ కేంద్రమంత్రి, రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న ఆయన సొంతూరు మొగల్తూరులో అభిమానుల సమక్షంలో సంస్మరణ సభ జరిగింది. దీనికి భారీగా అభిమానులు హాజరయ్యారు. అంతేకాదు దాదాపు లక్ష మందికి ఈ సభలో భోజనాలు ఏర్పాట్లు చేసారు.

5. అల్లు శిరీష్  ABCD తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న అల్లు శిరీష్.. మూడేళ్ళ గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ప్రేమ కాదంట. ఈ సినిమాను ఇప్పుడు టైటిల్ మార్చి విడుదల చేస్తున్నారు. శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో రాకేష్ శశి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఊర్వశివో రాక్షసివో టైటిల్ ఖరారు చేసారు. తాజాగా టీజర్ విడుదలైంది. సినిమా నవంబర్ 4న రిలీజ్ కానుంది.

6. శాకుంతలం  సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కిస్తున్న భారీ పీరియాడికల్ ప్రేమకథాచిత్రం శాకుంతలం. ఈ మధ్యే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన యూనిట్.. తాజాగా అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఈ సినిమాను 3డిలోనూ తీసుకొస్తున్నట్లు తెలిపారు దర్శక నిర్మాత గుణశేఖర్. దీంతో సినిమా విడుదల ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

7. వరుణ్ సందేశ్  వరుణ్ సందేశ్, సీతల్ భట్ జంటగా ఆర్.యన్ హర్ష వర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమాకు హైదరాబాద్‌లోని ఫిలింనగర్ సాయిబాబా దేవాలయంలో పూజా కార్యక్రమాలు జరిపారు. పలువురు సినీ ప్రముఖుల మధ్య ఘనంగా ప్రారంభమైంది. దీనికి ప్రముఖ నిర్మాత దామోదర ప్రసాద్ ముఖ్య అతిథిగా వచ్చారు.

8. లోకం ఎరుగని కథ  సురేంద్ర కుమార్, హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా లోకమెరుగని కథ. ఈ సినిమాలో పూజిత హీరోయిన్‌గా నటించారు. రవికాంత్ జమి నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర టీజర్ రిలీజ్ చేశారు.

9. నేను క్రేరాఫ్ నువ్వు రత్న కిషోర్, సన్య సిన్హా, సత్య ప్రధాన పాత్రల్లో సాగారెడ్డి తుమ్మ స్వీయ దర్శకత్వంలో చేసిన సినిమా నేను c/o నువ్వు. ఇవాళ విడుదల కానున్న ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్ ఏర్పాటు చేసారు. పరువు హత్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం చూస్తే.. వాటిని ఎలా అరికట్టాలో అవగాహన పెరుగుతుందని షోకు వచ్చిన పలువురు రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడ్డారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.