Bigg Boss 6 Telugu: సతీమణి సీమంతం.. బిగ్ బాస్ హౌస్ నుంచే ఆశీర్వదించిన రేవంత్.

హౌస్ లో గేమ్ ఆడుతున్న వారిలో గట్టిగా చెప్పే పేరు రేవంత్. పాపులర్ సింగర్ గా పేరు తెచ్చుకున్న రేవంత్.. బిగ్ బాస్ హౌస్‌లో తనదైన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.

Bigg Boss 6 Telugu: సతీమణి సీమంతం.. బిగ్ బాస్ హౌస్ నుంచే ఆశీర్వదించిన రేవంత్.
Revanth
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 30, 2022 | 9:59 AM

బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా సాగింది. ఇన్ని రోజులు ఏడుపులు, గోలలతో, అలకలతో సాగుతున్న బిగ్ బాస్ నిన్న మాత్రం ఎమోషన్స్ తో నిండిపోయింది. హౌస్ లో గేమ్ ఆడుతున్న వారిలో గట్టిగా చెప్పే పేరు రేవంత్. పాపులర్ సింగర్ గా పేరు తెచ్చుకున్న రేవంత్.. బిగ్ బాస్ హౌస్‌లో తనదైన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తనకున్న కోపంతో నాగార్జునతో చివాట్లు తింటున్నా.. టాస్క్‌లలో తనదైన గేమ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. రేవంత్ బిగ్ బాస్ హౌస్ లో వచ్చే సమయానికి ఆయన భార్య నిండు గర్భిణీ. చాలా సందర్భలలో తన భార్య గురించి తలుచుకొని ఎమోషనల్ అయ్యాడు కూడా..

ఇక నిన్నటి ఎపిసోడ్ లో..రేవంత్ భార్య సీమంతాన్ని చూపించారు. రేవంత్ ఇంట్లో జరగాల్సిన సీమంత వేడుకను బిగ్ బాస్ హౌస్‌లో చూపించారు. రేవంత్ ఒక్కడినే హౌస్ లోని గార్డెన్ ఏరియాలోకి రమ్మన్నాడు బిగ్ బాస్.. ‘మునుపటి వారం మీ భార్య సీమంతం జరిగింది.. ఆ వేడుకలో మీరు స్వయంగా పాలుపంచుకోలేకపోయిన కారణంగా ఆ మధుర క్షణాలను మీకు చూపించాలని అనుకుంటున్నారు’ అంటూ రేవంత్ సతీమణి అన్విత సీమంత వేడుక వీడియోను చూపించారు బిగ్ బాస్. దాంతో రేవంత్ ఎమోషనల్ అయ్యాడు. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత హౌస్ లో ఉన్న వాళ్ళను పిలిచాడు. అందరు వచ్చి రేవంత్ ను హగ్ చేసుకొని అభినందనలు తెలిపారు. పళ్లెంలో స్వీట్స్, పూలు, పళ్లు పెట్టి.. వీడియోలో కనిపిస్తున్న తన భార్య నుదుటిపై బొట్టు పెట్టి, గంధం పూసి, అక్షింతులు వేసి బిగ్ బాస్ హౌస్ నుంచే ఆశీర్వదించాడు రేవంత్.   రేవంత్. ఆ తరువాత రేవంత్.. తన భార్య కోసం ఓ పాట పాడాడు. ఇక నిన్నటి ఎపిసోడ్ తో రేవంత్ కు కావాల్సినంత ఫుట్టేజ్ దొరికింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.