Spirit Movie: ‘స్పిరిట్’ పై క్రేజీ అప్డేట్.. ప్రభాస్ సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్న ఆ స్టార్ హీరో తనయుడు
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ది మోస్ట్ అవైటైడ్ సినిమాల్లో స్పిరిట్ ఒకటి. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి ఒక ఆసక్తికర వార్త వినిపిస్తోంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం స్పిరిట్. ఈ ప్రాజెక్ట్ అప్‌డేట్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఒక చిన్న ఆడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. ‘సౌండ్ స్టోరీ ఆఫ్ ది ఫిలిం స్పిరిట్’ అంటూ డార్లింగ్ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చారు. ప్రభాస్ ఒక పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ ముద్దుగుమ్మకు ఇదే మొదటి తెలుగు సినిమా. తాజాగా ఈ మూవీకి సంబంధించి వరుసగా అప్డేట్స్ ఇస్తున్నారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. తాజాగా జిగ్రీస్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన ఆయన ప్రభాస్ ఫ్యాన్స్‌కు అద్దిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. స్పిరిట్ చిత్ర షూటింగ్ ఈ నెలఖరులో ప్రారంభించినున్నట్లు తెలిపారు. దీంతో రెబల్ స్టార్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ఈ సంగతి పక్కన పెడితే స్పిరిట్ సినిమాపై రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవితో పాటు కొరియన్ స్టార్ డాన్‌లీ కూడా నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రూమర్లను సందీప్ రెడ్డి కొట్టిపారేశాడు. ఇప్పుడు స్పిరిట్ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త నెట్టింట వైరల్‌గా మారింది.అదంటంటే ప్రభాస్ మూవీతోనే టాలీవుడ్ స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ కుమారులు ఎంట్రీ ఇవ్వనున్నారని టాక్ నడుస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తనయుడు రిషి మనోజ్, అలాగే హీరో రవితేజ కుమారుడు మహదాన్ భూపతిరాజు స్పిరిట్ సినిమాకు పని చేయనున్నారని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు సందీప్ రెడ్డి వంగాకు అసిస్టెంట్స్ డైరెక్టర్స్‌గా పని చేస్తారని టాలీవుడ్‌లో జోరుగా చర్చ నడుస్తోంది. త్రివిక్రమ్ తనయుడు సంగతేంటో తెలియదు కానీ రవితేజ కుమారుడు మాత్రం ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడని టాక్ వినిపిస్తోంది.
స్పిరిట్ సినిమాలో త్రివిక్రమ్, రవితేజల కుమారులు..
#SandeepReddyVanga ropes in two star kids as assistant directors for #Spirit 🔥
Rishie Manoj (#Trivikram’s son) & Mahadhan (#RaviTeja’s son) join the team! 🎬#Prabhas pic.twitter.com/vHb7KbucL8
— CHITRAMBHALARE (@chitrambhalareI) November 13, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








