Bandla Ganesh Corona: మరోసారి కరోనా బారిన పడిన బండ్ల గణేష్.. ఐసీయూలో చికిత్స అందిస్తోన్న వైద్యులు..?
Bandla Ganesh Corona: కరోనా మహమ్మారి ఇప్పట్లో మానవాళిని వదిలేసేలా కనిపించడం లేదు. ఓ వైపు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా మరోవైపు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం సెకండ్ వేవ్ పేరుతో అలజడి సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా..
Bandla Ganesh Corona: కరోనా మహమ్మారి ఇప్పట్లో మానవాళిని వదిలేసేలా కనిపించడం లేదు. ఓ వైపు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా మరోవైపు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం సెకండ్ వేవ్ పేరుతో అలజడి సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా రోజురోజుకీ పాజిటిల్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇక మరణాల సంఖ్య కూడా పెరుగుతుండడం ఆందోళన కలిగించే అంశం. ఇదిలా ఉంటే ఒకసారి కరోనా వచ్చిన తర్వాత మళ్లీ కరోనా సోకదని చాలా మంది భావిస్తుంటారు. కానీ ఇది నిజం కాదని చాటిచెబుతోందీ మహమ్మారి. ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ మరోసారి కరోనా బారిన పడ్డాడన్న వార్తలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎందుకంటే గతంలో కరోనా బారిన పడిన గణేష్ విజయవంతంగా కోలుకున్నాడు. కానీ ఇప్పుడు మరోసారి కరోనా సోకిందన్న వార్తలు వైరస్ లక్షణంపై ప్రశ్నలను రేకెత్తిస్తోంది. ఇదిలా ఉంటే రెండో సారి కరోనా సోకడంతో బండ్ల గణేష్ వెంటనే ఆసుపత్రిలో చేరాడని తెలుస్తోంది. ప్రస్తుతం బండ్ల గణేష్ జూబ్లీహిల్స్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. వైద్యులు బండ్లాను ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే బండ్ల గణేష్ ఇటీవల వకీల్ సాబ్ ప్రిరిలీజ్ ఈవెంట్ వేడుకలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ఉత్సాహంగా కనిపించిన గణేష్ వేడుక ముగిసిన కొన్ని రోజులకే కరోనా బారిన పడ్డారు. ఇదిలా ఉంటే ఈ ఈవెంట్‌లో పాల్గొన్న మరికొందరు కూడా కరోనా బారిన పడడంతో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
జేపీలో చేరిన నటి హేమ.. ఫస్ట్ స్పీచ్‌తోనే బీజేపీ నేతలకు చుక్కలు.. వైరల్‌గా మారిన వీడియో
Refund: వెంటనే డబ్బులు రిఫండ్ చేయండి.. విమానయాన సంస్థలకు కేంద్ర ప్రభుత్వ ఆదేశం!