Refund: వెంటనే డబ్బులు రిఫండ్ చేయండి.. విమానయాన సంస్థలకు కేంద్ర ప్రభుత్వ ఆదేశం!

గతేడాది కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా లాక్ డౌన్ విధించడంతో ముందుగా ప్రణాళిక వేసుకున్న ప్రకారం తమ ప్రయాణాలు చేసే అవకాశం లేకుండా పోయింది.

Refund: వెంటనే డబ్బులు రిఫండ్ చేయండి.. విమానయాన సంస్థలకు కేంద్ర ప్రభుత్వ ఆదేశం!
refund
Follow us

|

Updated on: Apr 13, 2021 | 8:14 PM

Refund: గతేడాది కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా లాక్ డౌన్ విధించడంతో ముందుగా ప్రణాళిక వేసుకున్న ప్రకారం తమ ప్రయాణాలు చేసే అవకాశం లేకుండా పోయింది. స్వస్థలాలకు వెళ్లాలనుకున్నవారు కూడా ఉన్నచోటినే ఉండిపోయి ఇబ్బందులు పడ్డారు. అయితే, అప్పుడు తమ ప్రయాణాల కోసం విమాన టికెట్లు బుక్ చేసుకున్న వారు టికెట్లు క్యాన్సిల్ చేసుకున్నారు. కానీ, ఆ డబ్బులు ఇప్పటివరకూ టికెట్ బుక్ చేసుకున్నవారికి రిఫండ్ కాలేదు. ఈ విషయంపై పౌర విమాన శాఖ ఈరోజు ప్రయాణీకుల టికెట్ల డబ్బులు వాపసు చేయాలని ఆదేశించింది. ఇటీవల ఈ విషయంపై పౌర విమాన శాఖకు సుప్రీం కోరు విస్పష్ట ఆదేశాలు ఇచ్చింది. అందులో లాక్ డౌన్  సమయంలో రద్దయిన విమానాలకు సంబంధించిన ప్రయాణికులకు మార్చి 31లోగా నగదు తిరిగి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ లోపు ప్రయాణికులకు చెల్లింపులు జరగాలని ఆదేశించింది.

అయితే, కొన్ని విమాన సంస్థలు మాత్రం చెల్లింపులు జరపలేదు. గో ఎయిర్, ఇండిగో ఎయిర్‌లైన్స్ టిక్కెట్ డబ్బులను ప్రయాణికులకు తిరిగి చెల్లించాయి కానీ, స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఆసియా, విస్తారా ఇప్పటి వరకూ డబ్బులు చెల్లించలేదు. ఈ క్రమంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సెక్రెటరీ విమానయాన సంస్థల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఇప్పటివరకూ డబ్బులు రిఫండ్ చేయకపోవడంపై కేంద్రం వారిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. లాక్ డౌన్ సమయంలో రద్దయిన విమానాలకు సంబంధించిన డబ్బులు వెంటనే ప్రయాణీకులకు చెల్లించాలని ఆదేశించారు. ‘‘లాక్‌డౌన్ సమయంలో రద్దయిన విమానాల టిక్కెట్లు రిఫండ్ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చెల్లించడం జరుగుతుంది.. కోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉన్నాం. పెండింగ్‌లో ఉన్న పిఎన్‌ఆర్‌ల వివరాలను అందజేయాలని’’ తన ప్రయాణ భాగస్వాములు, ఏజెంట్లకు స్పైస్ జెట్ మార్చి 2021లో లేఖ రాసింది. ఎయిరిండియా సైతం 5.20 లక్షల మంది ప్రయాణికులకు రూ.2,000 కోట్లు చెల్లించడానికి సిద్ధమయ్యింది. గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రూ.1,000 కోట్ల చెల్లించామని ఎయిరిండియా అధికార ప్రతినిధి తెలిపారు.

Also Read: Banks Privatisation: బ్యాంకుల ప్రయివేటీకరణపై రేపు కీలక సమావేశం.. ఆ రెండు ప్రభుత్వ బ్యాంకులు ఇక ప్రయివేట్ కావచ్చు!

Kumbh Mela 2021: హరిద్వార్ కుంభ మేళాకు పోటెత్తిన భక్తులు.. 102 మంది కరోనా పాజిటివ్..!