AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kumbh Mela 2021: హరిద్వార్ కుంభ మేళాకు పోటెత్తిన భక్తులు.. 102 మంది కరోనా పాజిటివ్..!

కుంభమేళాలో భాగంగా హరిద్వార్​లో రెండో షాహీ స్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తుల్లో 102 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ.

Kumbh Mela 2021: హరిద్వార్ కుంభ మేళాకు పోటెత్తిన భక్తులు.. 102 మంది కరోనా పాజిటివ్..!
Haridwar Kumbh Mela 2021
Balaraju Goud
|

Updated on: Apr 13, 2021 | 7:14 PM

Share

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ఏమాత్రం ఆగడంలేదు. దేశ వ్యాప్తంగా నిత్యం లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కాగా, కుంభమేళాలో భాగంగా హరిద్వార్​లో రెండో షాహీ స్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తుల్లో 102 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు అధికారులు వెల్లడించారు. ఆదివారం ఉదయం 11:30 నుంచి సోమవారం సాయంత్రం 5 గంటల వరకు 18,169 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించామనీ.. అందులో 102 మందికి కరోనా సోకినట్టు గుర్తించామని పేర్కొన్నారు.

కుంభమేళాలో భాగంగా 12వ రోజు గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు లక్షలాది మంది భక్తులు హరిద్వార్‌కు పోటెత్తారు. కాగా, “సోమవతి అమావాస్య”లో భాగంగా బ్రహ్మ కుండ్, హరికిపౌరి వద్ద భక్తులు పోటెత్తారు. వివిధ మహామండలేశ్వర నాయకత్వంలోని సాధువులు పుణ్య స్నానాలు అచరించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శాంతియాత్రగా సాధువులు కదలి వస్తుండగా, ఉత్తరాఖండ్ ప్రభుత్వం హెలికాప్టర్ల ద్వారా పూలరేకులను కురిపించడంతో ఈ దర్శకులు గంగానదిలో స్నానాలు చేశారు. అయితే, వారితో పాటు భక్తులు చాలామంది మాస్కులు ధరించకుండా, సామాజిక దూరాన్ని పాటించకుండా, చెప్పులు లేకుండా కవాతు పాల్గొన్నారని భక్తులు తెలిపారు.

అయితే, ప్రస్తుతం కొవిడ్ ఉదృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ అధికారులు సరైన ఏర్పాట్లు చేపట్టలేదని భక్తులు ఆరోపిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక కోవిడ్ ఆంక్షలు అమలు చేస్తున్నామన్న అధికారుల ఎక్కడా కనిపించలేదని మండిపడ్డారు. హరిద్వార్ రైల్వే స్టేషన్‌కి, ఘాట్లకు మధ్య కనీసం థర్మల్ స్క్రీనింగ్ పాయింట్లు ఏర్పాటు చేయలేదనీ… మాస్క్ లేకుండా వస్తున్న వారికి జరిమాన కూడా విధించడం లేదని చెబుతున్నారు.

ఇదిలావుంటే, కుంభమేళాకు వచ్చే వారికి కొవిడ్ నెగిటివ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్టు తప్పనిసరి అయినప్పటికీ… కొంతమందికి ఈ రిపోర్టు లేకుండానే చెక్‌పాయింట్ల వద్ద వదిలేస్తున్నట్టు మధ్య ప్రదేశ్‌ నుంచి వచ్చిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తెలిపారు.

Read Also…  

Chain Snatcher: ప్రశ్నార్థకంగా మారుతోన్న మానవత్వం.. కనీసం గర్భవతి అని కూడా చూడకుండా.. ఈడ్చుకెళ్లి దుండగులు..

అభివృద్ధి నిధులన్నీ కేంద్రానివే.. పోలవరం ప్రాజెక్టుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు