AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chain Snatcher: ప్రశ్నార్థకంగా మారుతోన్న మానవత్వం.. కనీసం గర్భవతి అని కూడా చూడకుండా.. ఈడ్చుకెళ్లిన దుండగులు..

Chain Snatcher: రచయిత, గాయకుడు అందె శ్రీ చెప్పినట్లు మానవత్వం ఉన్న వ్యక్తిని భూతద్దం వేసి వెతినికా కనబడడం లేడు. సమాజంలో మానవత్వం ప్రశ్నార్థకంగా మారుతోంది. డబ్బే పరమావధిగా మారిపోయిన రోజుల్లో మనుషులకు, వారి ప్రాణాలకు...

Chain Snatcher: ప్రశ్నార్థకంగా మారుతోన్న మానవత్వం.. కనీసం గర్భవతి అని కూడా చూడకుండా.. ఈడ్చుకెళ్లిన దుండగులు..
Chain Snatchers
Narender Vaitla
|

Updated on: Apr 13, 2021 | 7:42 PM

Share

Chain Snatcher: రచయిత, గాయకుడు అందెశ్రీ చెప్పినట్లు మానవత్వం ఉన్న వ్యక్తిని భూతద్దం వేసి వెతినికా కనబడడం లేడు. సమాజంలో మానవత్వం ప్రశ్నార్థకంగా మారుతోంది. డబ్బే పరమావధిగా మారిపోయిన రోజుల్లో మనుషులకు, వారి ప్రాణాలకు విలువ లేకుండా పోతోంది. తాజాగా చెన్నైలో జరిగిన ఓ సంఘటన చూస్తుంటే ఈ మాటలు అక్షర సత్యాలుగా అనిపిస్తున్నాయి. నిండు గర్భవతి అని కూడా చూడకుండా ఓ మహిళలపై ఇద్దరు వ్యక్తులు చేసిన దాడి అత్యంత పాశవికంగా ఉంది. శుక్రవారం జరిగిన ఈ ఘటన అందరినీ కలచి వేస్తోంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాజధాని చైన్నైలోని పల్వరంలోని రేణుకానగర్‌లో గీత (25) అనే ఓ మహిళ గుడి నిల్చుని దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఆమె ఎనిమిది నెలల గర్భవతి. అయితే ఆమె దేవుడికి దండం పెట్టుకుంటున్న సమయంలోనే అక్కడికి ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి ఆగారు. ఆ ఇద్దరిలో ఒకరు బైక్‌ దిగి గీతను సమీపించాడు. ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో గీత ప్రతిఘటించింది.. కానీ ఎంతకు తగ్గని ఆ దుర్మార్గుడు గీతను నెట్టేశాడు. దీంతో రోడ్డుపై పడ్డ గీత మెడలోని చైన్‌ను లాగుతూ కొంచెం దూరం ఈడ్చుకెళ్లాడు. చివరికి ఆ గోలుసును లాక్కొని పారిపోయాడు. కనీసం గర్భవతి అని కూడా చూడకుండా దిగిన దుశ్చర్యకు సంబంధించిన సన్నివేశాలు అక్కడే ఉన్న ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డ్‌ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన వారు వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే గీత భర్త.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Chain Snatching

Chain Snatching

Also Read: Massive Fire at Mall: షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం.. లాక్‌డౌన్ కారణంగా తప్పిన పెను ముప్పు

Kidnap Case: స్టూడెంట్‌ను కిడ్నాప్ చేసిన పీటీ సార్.. ఆపై పెళ్లి చేసుకునేందుకు ప్లాన్.. చివరకు ఏమైందంటే..?

Oxygen Shortage: కరోనా మరణ మృదంగం.. ఆక్సిజన్ కొరతతో ఏడుగురు రోగుల మృతి.. బంధువుల ఆందోళన

Follow Us
రాత్రికి రాత్రే వీరి అప్పులు మొత్తం తీర్చేస్తారు..
రాత్రికి రాత్రే వీరి అప్పులు మొత్తం తీర్చేస్తారు..
ప్రపంచకప్ హీరోతోపాటు మరో ముగ్గురికి మొండిచేయి.. ఇంత అన్యాయమా?
ప్రపంచకప్ హీరోతోపాటు మరో ముగ్గురికి మొండిచేయి.. ఇంత అన్యాయమా?
: రూ.1000 లంచానికి లక్ష బహుమతి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
: రూ.1000 లంచానికి లక్ష బహుమతి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
ఉప్మా అంటే ముఖం మాడ్చుకుంటున్నారా?కమ్మని పెరుగు ఉప్మా ట్రై చేయండి
ఉప్మా అంటే ముఖం మాడ్చుకుంటున్నారా?కమ్మని పెరుగు ఉప్మా ట్రై చేయండి
6 గంటల్లోనే విజయవాడ టు బెంగళూరు.. కొత్త హైవే త్వరలోనే..
6 గంటల్లోనే విజయవాడ టు బెంగళూరు.. కొత్త హైవే త్వరలోనే..
అలాంటి పరిస్థితి వస్తే జీవితంలో అసలు పెళ్లే చేసుకోను..
అలాంటి పరిస్థితి వస్తే జీవితంలో అసలు పెళ్లే చేసుకోను..
పెళ్లైన పురుషులు అస్సలు చేయకూడని నంబర్ వన్ తప్పు ఇదీ!
పెళ్లైన పురుషులు అస్సలు చేయకూడని నంబర్ వన్ తప్పు ఇదీ!
ఐపీఎల్ తోపులకు మొండిచేయి.. దేశవాళీ హీరోలకే జై కొట్టని గంభీర్
ఐపీఎల్ తోపులకు మొండిచేయి.. దేశవాళీ హీరోలకే జై కొట్టని గంభీర్
హాస్పిటల్స్ ఖర్చులు లేకుండా ఆరోగ్యాన్ని ఇచ్చే రాగి సమోసాలు
హాస్పిటల్స్ ఖర్చులు లేకుండా ఆరోగ్యాన్ని ఇచ్చే రాగి సమోసాలు
జీతం రాగానే అయిపోతోందా? డబ్బు ఆదా చేయడానికి స్మార్ట్ టిప్స్!
జీతం రాగానే అయిపోతోందా? డబ్బు ఆదా చేయడానికి స్మార్ట్ టిప్స్!