AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Pandemic: పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ట్విట్టర్ లో విస్తృతంగా సమాచారాన్ని అందుబాటులో ఉంచుతున్న ప్రభుత్వం

కరోనా రెండో వేవ్ విరుచుకుపడుతోంది. రోజు రోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి

Corona Pandemic: పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ట్విట్టర్ లో విస్తృతంగా సమాచారాన్ని అందుబాటులో ఉంచుతున్న ప్రభుత్వం
Corona Pandamic
KVD Varma
|

Updated on: Apr 13, 2021 | 6:52 PM

Share

Corona Pandemic: కరోనా రెండో వేవ్ విరుచుకుపడుతోంది. రోజు రోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా పై కేంద్ర ప్రభుత్వం ప్రజలను ఎంత అప్రమత్తం చేస్తున్నా.. కరోనా ఉధృతికి అడ్డుకట్ట పడటం లేదు. అన్నిరకాలుగానూ కరోనా ప్రమాద ఘంటికలపై ప్రచారం చేస్తూ వస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే అన్ని ప్రసార మాధ్యమాలలోనూ కరోనా ఇబ్బందులపై.. కరోనా సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ఎంతగానో ప్రచారం చేసుకుంటూ వస్తోంది. ఇప్పుడు ఆ ప్రచారానికి తోడుగా ట్విట్టర్ లో కూడా జోరుగా ప్రచారం  ప్రారంభించింది భారత ప్రభుత్వం. @COVIDNewsByMIB పేరుతో #IndiaFightsCorona అనే హాష్ టాగ్ తో ట్విట్టర్ లో కూడా కరోనా అప్ డేట్స్ తో ఉధృతంగా ప్రచారం మొదలు పెట్టింది.  ఈ ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే అన్నిరకాల కోవిడ్ సంబంధ విషయాలను నెటిజన్లతో పంచుకుంటోంది.

కరోనా రెండో వేవ్ చాలా ఉధృతంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఆందోళనకరంగా పెరిగిపోతున్నాయి. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. చాలా రాష్ట్రాలు టీకా నిల్వలు లేవని చెబుతూ వస్తున్నాయి. కరోనా కేసులు పెరిగిపోతున్న తరుణంలో ఇది ఆందోళన కలిగిస్తోంది. ఇక ఛత్తీస్ గఢ్ రాజధాని రాయపూర్ లో కరోనాతో మరణించిన వారికోసం మార్చురీలు కూడా ఖాళీ లేకపోవడం అక్కడ పరిస్థితి తీవ్రతకు అడ్డం పడుతోంది.

కాగా, గత 24 గం.ల వ్యవధిలో దేశంలో కొత్తగా 1,61,736  కోవిడ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించింది. కరోనా కాటుకు 879 మంది మృతి చెందటంతో మొత్తం మరణాల సంఖ్య 1,71,058కి చేరింది. నిన్నటితో పోలిస్తే కోవిడ్ కేసుల సంఖ్య కాస్త తగ్గినట్టు కనిపించింది. కానీ అదే ఉధృతి కొనసాగుతోంది.

దేశంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,36,89,453కి చేరుకుంది. అత్యధిక కోవిడ్ కేసులు నమోదైన దేశాల జాబితాలో బ్రెజిల్‌ను వెనక్కినెట్టి భారత్ రెండో స్థానంలోకి చేరగా…అగ్రరాజ్యం అమెరికా మొదటి స్థానంలో ఉంది. భారత్‌లో ఇప్పటి వరకు 1,22,53,697 మంది కోవిడ్ నుంచి కోలుకోగా…ప్రస్తుతం 12,64,698 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Also Read: Bank Deposits: కరోనా టీకా వేసుకోండి..మాదగ్గర డిపాజిట్ చేయండి..ఎక్కువ వడ్డీ పొందండి.. ఆ బ్యాంక్ సూపర్ ఆఫర్!

Vaccination: కొత్తగా ఆమోదం పొందిన స్పుత్నిక్ వి టీకాను ఇండియాలో ఉత్పత్తి చేస్తున్న ఐదు కంపెనీలు..పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేది అప్పుడే..