AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉగ్రరూపం.. కొత్తగా 4,228 కేసులు.. జిల్లాలవారీగా వివరాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉగ్రరూపం దాల్చింది. వైరస్‌ బారినపడుతున్న బాధితుల సంఖ్య ప్రమాదకరంగా పెరుగుతోంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 35,582 కరోనా టెస్టులు  చేయగా..

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉగ్రరూపం.. కొత్తగా 4,228 కేసులు.. జిల్లాలవారీగా వివరాలు
Ap Corona
Ram Naramaneni
|

Updated on: Apr 13, 2021 | 6:46 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉగ్రరూపం దాల్చింది. వైరస్‌ బారినపడుతున్న బాధితుల సంఖ్య ప్రమాదకరంగా పెరుగుతోంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 35,582 కరోనా టెస్టులు  చేయగా.. 4,228 కేసులు వెలుగుచూశాయి. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య  9,32,892 కు చేరింది.  గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల చిత్తూరులో నలుగురు, నెల్లూరులో ఇద్దరు, గుంటూరు, కృష్ణా, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 7,321కి చేరింది.

24 గంటల వ్యవధిలో 1,483 మంది బాధితులు వైరస్ బారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రికవరీల సంఖ్య 8,99,721కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 25,850 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,54,98,728 నమూనాలను టెస్ట్ చేసినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. అత్యధికంగా చిత్తూరులో 842, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 48 కేసులు వెలుగుచూశాయి.

కరోనా కేసుల ఉధృతి పెరిగిన నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి అని చెబుతున్నారు. వైరస్‌ను లైట్ తీసుకోవద్దని, అలా చేసిన పక్షంలో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

Also Read: ఈ వీడియో చూస్తే నవ్వలేక మీ పొట్ట చెక్కలవుతుంది.. చివర్లో ట్విస్ట్ మాత్రం మిస్ అవ్వొద్దు

పెళ్లి కొడుకు బుల్లెట్ అడిగితే వధువు తరఫువాళ్లు అపాచీ బైక్ ఇచ్చారు.. దీంతో వరుడు బట్టలు విప్పేసి

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్