AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid Horror: శ్మశానంలో చోటు లేదు.. మార్చురీలో అవకాశం లేదు.. కరోనా మృత్యుఘోషలో ఘోర పరిస్థితులు!

అంతాబావుంది.. ఇక బయటపడ్డట్టే అనిపించింది. కానీ, ఇంతలోనే మరింత వేగంగా చుట్టుముట్టేసింది. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కొత్తగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.

Covid Horror: శ్మశానంలో చోటు లేదు.. మార్చురీలో అవకాశం లేదు.. కరోనా మృత్యుఘోషలో ఘోర పరిస్థితులు!
Corona Pandamic
KVD Varma
|

Updated on: Apr 13, 2021 | 5:00 PM

Share

Covid Horror: అంతాబావుంది.. ఇక బయటపడ్డట్టే అనిపించింది. కానీ, ఇంతలోనే మరింత వేగంగా చుట్టుముట్టేసింది. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కొత్తగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా మహమ్మారి విజృంభణతో మరోసారి ఆసుపత్రులు పేషేంట్లతో నిండిపోతున్నాయి. చాలా రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. చత్తీస్‌గఢ్‌లో అయితే చెప్పలేనంత దయానీయంగా పరిస్థితి మారిపోయింది. ఇక్కడ కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి అంత్యక్రియలు చేయడానికి శ్మశానాలు దొరకడం లేదు. అంటే అక్కడి పరిస్థితిని అంచనా వేయొచ్చు. రాయపూర్ లోని అతి పెద్ద ఆసుపత్రి నిండా మృతదేహాలే. ఎటుచూసినా కరోనా మృతుల శరీరాలతో అక్కడ దృశ్యం హృదయవిదారకంగా ఉంది. డాక్టర్ బీఆర్ అంబెడ్కర్ ఆసుపత్రిలో మృతదేహాలను భద్రపరచడానికి ఖాళీలు లేక.. ఎక్కడ అవకాశం ఉందా అని ఆసుపత్రి సిబ్బంది దిక్కులు చూస్తున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ అయినా ఒక వీడియో వైరల్ గా మారుతోంది. కరోనాతో మరణిస్తున్న రోగాల మృతదేహాలు వేగంగా మార్చురీ వద్ద పేరుకుపోతున్నాయని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గత వారం రోజులుగా అక్కడ ఐసీయూ ఆక్సిజన్ పథకాలు నూరు శాతం నిండిపోయాయి. ఈ విషయంపై స్పందించిన ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ మీరా బఘేల్ మాట్లాడుతూ ” ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు మరణిస్తారని ఎవరూ ఊహించారు. మామూలు సామియాల్లో ఆసుపత్రిలో చికిత్సకు వచ్చి చనిపోయినవారి మృతదేహాలను భద్రపరిచేంత చోటు మాత్రమే ఇక్కడ ఉంది. అందుకు సరిపడే అన్ని ఫ్రీజర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఒకటి రెండు మరణాలు చోటు చేసుకునే పరిస్థితి ఉంటుంది. మరి..10 నుంచి 20 మంది చనిపోతే.. వారి మృతదేహాలను ఎలా భద్రపరచగలం? పది నుంచి ఇరవై మృతదేహాల గురించి మేము అన్నీ సిద్ధం చేస్తే ఇక్కడ 50-60 మంది చనిపోతున్నారు. మరి ఇంతమందికి ఫ్రీజర్లు ఎలా ఏర్పాటు చేయగలం. శ్మశాన వాటికలు కూడా నిండిపోయాయి.” అంటూ చెప్పారు.