AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RGV New Movie: ఏపీ రాజకీయాలపై రామ్‌గోపాల్‌ వర్మ మరో అస్త్రం… ఈసారి జగన్‌ మోహన్‌ రెడ్డి టార్గెట్‌..

RGV New Movie: రామ్‌ గోపాల్‌ వర్మ... సంచలనాలకు మారుపేరు ఈ పేరు. రాము ఎక్కడ ఉంటే అక్కడ ఎప్పుడూ ఓ కాంట్రవర్సీ చక్కర్లు కొడుతుంటుంది. ఎప్పుడు ఏదో ఒక అంశంపై తనదైన రీతిలో స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు వర్మ. తన సినిమాకు పబ్లిసిటీని...

RGV New Movie: ఏపీ రాజకీయాలపై రామ్‌గోపాల్‌ వర్మ మరో అస్త్రం... ఈసారి జగన్‌ మోహన్‌ రెడ్డి టార్గెట్‌..
Rgv Movie On Jagan
Narender Vaitla
|

Updated on: Apr 13, 2021 | 7:50 PM

Share

RGV New Movie: రామ్‌ గోపాల్‌ వర్మ… సంచలనాలకు మారుపేరు ఈ పేరు. రాము ఎక్కడ ఉంటే అక్కడ ఎప్పుడూ ఓ కాంట్రవర్సీ చక్కర్లు కొడుతుంటుంది. ఎప్పుడు ఏదో ఒక అంశంపై తనదైన రీతిలో స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు వర్మ. తన సినిమాకు పబ్లిసిటీని సరికొత్తగా సంపాదించుకుంటూ ఫ్రీగా పబ్లిసిటీని పొందుతుంటారు. ఇక వర్మ తీసే సినిమాలు కూడా ఆయన మాటల్లాగే సంచలనాలను మారు పేరుగా ఉంటాయి. సమాజాంలో జరిగే నిజ జీవిత కథల ఆధారంగా సినిమాలు తెరకెక్కించడం వర్మకు వెన్నెతో పెట్టిన విద్య. ఈ క్రమంలోనే రాజకీయ, సామాజిక అంశాలకు సంబంధించిన కథాంశాలను తీసుకొని సినిమాలు తీస్తుంటారు వర్మ. తెలుగు రాజకీయాల నేపథ్యంలో వర్మ ఇప్పటి వరకు.. ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’, ‘రక్త చరిత్ర’, ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’, ‘వంగవీటి’, ‘పవర్‌ స్టార్‌’ వంటి చిత్రాలను తెరకెక్కించారు. ఈ సినిమాల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ ఇవి తెలుగు రాష్ట్రాల్లో సృష్టించిన అలజడి మాములుది కాదు. ఇదిలా ఉంటే తాజాగా వర్మ మరో సంచలనంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సినిమా తీస్తానని ప్రకటించిన వర్మ.. ప్రస్తుతం ఆ ప్రాజెక్టును పక్కన పెట్టి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిని కథాంశంగా తీసుకొని ఓ సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘జగమొండి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు కూడా సమాచారం. మరి ఈ సినిమా పట్టాలెక్కుతుందా.. ? ఒక వేళ షూటింగ్‌ ప్రారంభమైతే.. ఇందులో జగన్‌ను పాజిటివ్‌గా చూపిస్తారా.? ఏమైనా నెగిటివ్‌ అంశాలను టచ్‌ చేస్తారా.? లాంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం రావాలంటే వర్మ అధికారిక ప్రకటన చేసే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: Banks Privatisation: బ్యాంకుల ప్రయివేటీకరణపై రేపు కీలక సమావేశం.. ఆ రెండు ప్రభుత్వ బ్యాంకులు ఇక ప్రయివేట్ కావచ్చు!

ప్రకృతి ఈ జీవికి అందంతో పాటు ‘అమరత్వం’ ఇచ్చింది.. కానీ మరో పెద్ద లోపం కూడా దానికి ఉంది…

Rebel Star Prabhas: ఆదిపురుష్ సినిమా పై వస్తున్న ఆవార్తలు అవాస్తవం.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు..

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్