Tollywood: రవితేజ సినిమాను నాని చూసుంటే.. రైటర్ ప్రసన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

మాస్ మహరాజా రవితేజ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. రవితేజ కెరీర్ లో సూపర్ హిట్ అయిన నా ఆటోగ్రాఫ్ మెమొరీ సినిమా గురించి రైటర్ ప్రసన్న ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Tollywood: రవితేజ సినిమాను నాని చూసుంటే.. రైటర్ ప్రసన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Raviteja, Nani

Updated on: Mar 04, 2025 | 7:08 AM

మాస్ మహారాజా రవితేజ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. రవితేజ నటించిన హిట్ చిత్రాల్లో నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ ఒకటి. మలయాళంలో సూపర్ హిట్టైన ఆటోగ్రాఫర్ సినిమాకు రీమేక్. 2004లో విడుదలైన ఈ రొమాంటిక్ డ్రామా తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం కమర్షియల్ హిట్ కాలేకపోయింది. కానీ ఈ సినిమా మాత్రం యూత్ ఫేవరేట్ మూవీగా నిలిచిపోయింది. ఈ సినిమాలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. ఇటీవలే మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేశారు మేకర్స్. ఈ క్రమంలో తాజాగా రచయిత ప్రసన్న కుమార్ ఈ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

మజాకా మూవీ ప్రమోషన్లలో భాగంగ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రైటర్ ప్రసన్న మాట్లాడుతూ.. “అప్పటికీ ఆ సినిమా చాలా తొందరగా వచ్చి ఉండొచ్చు. కానీ ఆ సినిమాలో అన్నీ ఉంటాయి. ఒక సినిమాకు ఏం కావాలో అంతా ఉంటుంది. ఇడియట్ తర్వాత వెంటనే రవితేజ నుంచి వచ్చిన ఆ సినిమా అడియన్స్ అంచనాలు అందుకోలేకపోయింది. అప్పుడు నేను బీటెక్ చదువుతున్నాను. సినిమా అంతా చూడకముందే టైటిల్ లో వచ్చే కవితలు చూసే ఏడ్చేశాను. నా ఫేవరెట్ సినిమాల్లో అదొకటి. ఇక ఇమేజ్ వైజ్ చూసుకుంటే నాని లాంటి ఇమేజ్ ను ఉన్న అతను చేసుంటే ఈ రోజుకీ నా ఆటోగ్రాఫ్ మూవీ ఒక క్లాసిక్ లా ఉండిపోయేది. నాకు గుర్తుంది.. ఇంటర్వెల్ సీన్ లో రవితేజను కొట్టి పడేస్తే ఒక బోటులో వెళ్తుంటుంది.. పక్క బోటులో హీరోయిన్ పెళ్లి చేసుకుని వెళ్తుంటుంది. అప్పుడు థియేటర్లలో కింద నుంచి అన్నా వెళ్లిపోతున్నారు.. వెయ్యి నా కొడుకుని అని అరిచారు. రవితేజ ఇమేజ్ నుంచి అలాంటి సినిమాను అడియన్స్ ఎక్స్ పెక్ట్ చేయలేదు’ అని అన్నారు.

నటుడు సందీప్ కిషన్, రీతు వర్మ జంటగా నటించిన లేటేస్ట్ చిత్రం మజాకా. త్రినాథరావు నక్నినా దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. మహాశివరాత్రి సందర్భంగా అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..