DilRaju: ‘అజిత్ కంటే విజయ్ పెద్ద స్టార్’.. దిల్ రాజు షాకింగ్ కామెంట్స్..
ఈ సినిమా సంక్రాంతికి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని తమిళంతోపాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రొడ్యూసర్ దిల్ రాజు చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. ఆయన మాటల పై మరో హీరో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న బడా ప్రొడ్యూసర్లలో దిల్ రాజు ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ఆయన.. ప్రస్తుతం తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రధాన పాత్రలో వరిసు మూవీని నిర్మి్స్తున్నారు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే హైప్ ఏర్పడింది. ఇక మరోవైపు ఈసినిమా నుంచి విడుదలైన రంజితమే సాంగ్ సెన్సెషన్ క్రియేట్ చేయగా.. వర్కింగ్ స్టిల్స్ ఆసక్తిని కలిగించాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతికి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని తమిళంతోపాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రొడ్యూసర్ దిల్ రాజు చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. ఆయన మాటల పై మరో హీరో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిల్ రాజు మాట్లాడుతూ.. ప్రస్తుతం తమిళనాడులో హీరో అజిత్ కుమార్ కంటే విజయ్ పెద్ద స్టా్ర్ అని అన్నారు. అందుకే వరిసు సినిమా కోసం మరిన్ని స్క్రీన్స్ కేటాయించాల్సిందిగా.. ఉదయనిధి స్టాలిన్ ను అభ్యర్థించేందుకు తాను చెన్నై వచ్చానని ఆయన తెలిపారు. దీంతో దిల్ రాజ్ వ్యాఖ్యలపై అజిత్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. వాస్తవానికి చాలా కాలంగా తమిళనాడులో విజయ్, అజిత్ ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతుంటుంది. గతంలో వీరిద్దరి సినిమాలు ఒకేసారి విడుదల కావడం అప్పట్లో థియేటర్ల వద్ద పెద్ద యుద్ధమే జరిగేది. ఇక ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత వీరిద్దరి సినిమాలు సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి. విజయ్ నటిస్తున్న వరిసు సినిమా.. అజిత్ నటిస్తోన్న తునివు మూవీస్ సంక్రాంతికి విడుదల కానున్నాయి . ఇక వీరి చిత్రాల విడుదలకు ఇంకా నెల రోజులు కూడా లేనందున, డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు స్క్రీన్‌ల సంఖ్యను ఖరారు చేస్తున్నారు.




తమిళనాడులో మొత్తం 800 థియేటర్లు ఉన్నాయి. అందులో విజయ్ సినిమాకు 400 మాత్రమే ఇస్తామని.. మిగతా 400 అజిత్ సినిమాకు కేటాయిస్తామని అంటున్నారు. నేను మాత్రం 450 కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది వ్యాపారం. అక్కడ అజిత్ సినిమాను ఉదయనిధి స్టాలిన్ రిలీజ్ చేస్తున్నారు. ఆయననే అడగాలని చెన్నై వచ్చాను. ఇక్కడ మాత్రం దిల్ రాజు అందరికీ కనిపిస్తుంటాడు. నేను గ్లామర్ గా ఉంటాను కాబట్టి నన్ను టార్గెట్ చేస్తున్నారేమో అంటూ చెప్పుకొచ్చారు దిల్ రాజు.
