AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు.. ఈ రెండు మూవీస్ పైనే అందరి చూపు..

హిందీ ప్రేక్షకులు రెండు బడా సినిమాలకోసం ఎదురుచూస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ' గేమ్ ఛేంజర్ '  అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'దేవర' కోసం ఎదురుచూస్తున్నారు బాలీవుడ్ జనాలు. నార్త్ ఇండియాలో ఈ సినిమాల రైట్స్  భారీ ధరలకు అమ్ముడుపోయాయి. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు.. ఈ రెండు మూవీస్ పైనే అందరి చూపు..
Game Changer, Devara
Rajeev Rayala
|

Updated on: Apr 19, 2024 | 9:30 AM

Share

టాలీవుడ్ సినిమాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఊపేస్తున్నాయి. హిందీ ఇండస్ట్రీలోనూ టాలీవుడ్ సినిమాలు రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా ‘బాహుబలి’, ‘కేజీఎఫ్ 2’, ‘RRR’  టి సినిమాలు హిందీ వెర్షన్‌లో దుమ్మురేపడంతో నార్త్  ఇండియాలో సౌత్ సినిమాలకు డిమాండ్ పెరిగింది. ఇప్పుడు హిందీ ప్రేక్షకులు రెండు బడా సినిమాలకోసం ఎదురుచూస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ‘ గేమ్ ఛేంజర్ ‘  అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ కోసం ఎదురుచూస్తున్నారు బాలీవుడ్ జనాలు. నార్త్ ఇండియాలో ఈ సినిమాల రైట్స్  భారీ ధరలకు అమ్ముడుపోయాయి. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ సినిమా హిందీ వెర్షన్‌లోనూ మెప్పించింది. అందుకే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లకు హిందీ ప్రేక్షకుల్లో విపరీతమైన అభిమానులు పెరిగిపోయారు. అలాగే ఈ ఇద్దరి హీరోల నుంచి రాబోయే సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ నార్త్ థియేట్రికల్ రైట్స్ హక్కులు రూ.75 కోట్లకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. పొలిటికల్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. అలాగే ఈ సినిమాలో రామ్‌చరణ్‌ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు.

‘దేవర’ సినిమా హిందీ థియేట్రికల్ రైట్స్ 50 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. అనిల్ టాటానీ దేవర మూవీ హక్కులను కొనుగోలు చేసినట్లు టాక్. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నేరుగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నాడు. హృతిక్ రోషన్‌తో కలిసి ‘వార్ 2’ సినిమాలో నటిస్తున్నాడు టైగర్. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది.

ఎన్టీఆర్ ఇన్ స్టా గ్రామ్

View this post on Instagram

A post shared by Jr NTR (@jrntr)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే