AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rishab Shetty: కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..

కేజీఎఫ్ రెండు పార్ట్ కు అలాగే కాంతార సినిమాలు తెలుగులోనూ భారీ విజయాలను అందుకున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కాంతార సినిమా మాత్రం ప్రేక్షకులను అలరించింది. కాంతార సినిమా కథకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దాంతో ఇప్పుడు కాంతార 2 కోసం ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. రిషబ్ శెట్టి గురించి రోజుకొక వార్త వస్తూనే ఉంది.

Rishab Shetty: కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
Rishab Shetty
Rajeev Rayala
|

Updated on: Apr 19, 2024 | 9:04 AM

Share

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలు అన్ని భాషల్లోనూ మంచి విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగ్తా తెలుగు ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కేజీఎఫ్ రెండు పార్ట్ కు అలాగే కాంతార సినిమాలు తెలుగులోనూ భారీ విజయాలను అందుకున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కాంతార సినిమా మాత్రం ప్రేక్షకులను అలరించింది. కాంతార సినిమా కథకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దాంతో ఇప్పుడు కాంతార 2 కోసం ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. రిషబ్ శెట్టి గురించి రోజుకొక వార్త వస్తూనే ఉంది. ‘కాంతార2’ సినిమాలో ఎవరెవరు  నటిస్తున్నారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు కాంతార సినిమాలో ఓ సీనియర్ హీరో నటిస్తున్నాడని తెలుస్తోంది.

తాజాగా రిషబ్ శెట్టి మలయాళ ప్రముఖ నటుడు మోహన్ లాల్ ను కలిశారు. దీంతో క్యూరియాసిటీ మరింత పెరిగింది. ‘కాంతార 2’ సినిమాలో నటిస్తున్నారా.? లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాంతార సినిమాకు ప్రీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘కాంతార: చాప్టర్ 1’ సినిమాపై అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ప్రస్తుతం రిషబ్ పాత్రల ఎంపికలో బిజీగా ఉన్నాడని సమాచారం.

ఈ క్రమంలోనే రిషబ్‌ మోహన్‌లాల్‌ని కలిశాడు. దాంతో ఇప్పుడు రకరకాల ఊహాగానాలు పుట్టుకొస్తున్నాయి. రిషబ్ మోహన్ లాల్ ను క్యాజువల్ గానే కలిశారా.? లేక సినిమాలో నటిస్తున్నాడా అన్నది తెలియాల్సి ఉంది. ‘లెజెండరీ మోహన్‌లాల్‌ను కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది’ అని రిషబ్ శెట్టి సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతోంది. ‘లెజెండరీ యాక్టర్ లెజెండరీని కలుసుకున్నారు’ అని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్‌గా మారింది. గతంలో రిషబ్ శెట్టి ఓ మలయాళ సినిమాలో నటిస్తాడని వార్తలు వచ్చాయి.ఏ విషయం పై రిషబ్ మాట్లాడుతూ.. ‘వారు నాకు ఆఫర్ చేసిన మాట వాస్తవమే. కానీ, అందుకు నేను అంగీకరించలేదు’ అని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్