AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malaika Arora: ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్

తాజాగా బాలీవుడ్ నటి మలైకా అరోరాను ఇప్పుడు నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. మలైకా అరోరా బాలీవుడ్ లో బిజీ ఆర్టిస్ట్ గా గడుపుతోంది. స్పెషల్ సాంగ్స్ కు ఈ అమ్మడు పెట్టింది పేరు. ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది.

Malaika Arora: ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
Malaika Arora
Rajeev Rayala
|

Updated on: Apr 19, 2024 | 10:18 AM

Share

సెలబ్రిటీలు చాలా విషయాలపై ఓపెన్‌గా మాట్లాడుతూ ఉంటారు. తమ పిల్లలకు కూడా అదే నేర్పుతారు. కొన్నిసార్లు చాలా విషయాలపై ఓపెన్ గా మాట్లాడి విమర్శలు కూడా ఎదుర్కొంటు ఉంటారు.. తాజాగా బాలీవుడ్ నటి మలైకా అరోరాను ఇప్పుడు నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. మలైకా అరోరా బాలీవుడ్ లో బిజీ ఆర్టిస్ట్ గా గడుపుతోంది. స్పెషల్ సాంగ్స్ కు ఈ అమ్మడు పెట్టింది పేరు. ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. అలాగే రకరకాల వీడియోలు కూడా షేర్ చేస్తూ అలరిస్తుంది. తాజాగా మలైకా తన కొడుకును ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె తన కొడుకు అర్హాన్ ఖాన్‌ ను రకరకాల ప్రశ్నలు అడిగింది.

మలైకా అరోరా తన కొడుకు అర్హాన్ ఖాన్‌ని కన్యత్వం గురించి అడిగింది . ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాంతో మలైకాపై పలువురు విమర్శలు చేస్తున్నారు. మలైకా ఓ షోను హోస్ట్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో అర్హాన్ , దేవ్ రియానీ పాల్గొన్నారు. ఈ క్రమంలో మలైకా తన కుమారుడిని అతని కన్యత్వం గురించి ప్రశ్నించింది. ‘ఎప్పుడు కన్యత్వాన్ని కోల్పోయావు’ అని మలైకా అర్హాన్‌ని ప్రశ్నించింది. దీనికి అర్హాన్ ‘వావ్’ అంటూ నవ్వాడు.. ప్రస్తుతం టీజర్‌లో ఇది కనిపిస్తోంది. పూర్తి వీడియో విడుదలైన తర్వాత అతను ఏం సమాధానం  చెప్పాడో తెలుస్తుంది.

అర్హాన్ కూడా మలైకాను ఓ ప్రశ్న అడిగాడు. ‘పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు’ అని తల్లిని అడిగాడు అర్హాన్. దీంతో మలైకా నవ్వుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. మలైకా, అర్జున్ కపూర్ డేటింగ్ చేస్తున్నారు. ఈ ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని టాక్. అయితే దీనిపై మలైకా వైపు నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. మలైకా కు ఆమె మొదటి భర్త అర్బాజ్ ఖాన్ పుట్టిన కొడుకే ఈ అర్హాన్ ఖాన్.

View this post on Instagram

A post shared by dumb biryani (@dumbbbiryani)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పని గొప్ప పాఠం..!
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పని గొప్ప పాఠం..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!
స్క్వాడ్‌లోనే లేడు.. కట్‌చేస్తే.. టాస్ టైంకి ప్లేయింగ్ 11లోకి..!
స్క్వాడ్‌లోనే లేడు.. కట్‌చేస్తే.. టాస్ టైంకి ప్లేయింగ్ 11లోకి..!
బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ.. చపాతీ, రైస్ రెండింటికీ ఇదే పర్ఫెక్ట్
బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ.. చపాతీ, రైస్ రెండింటికీ ఇదే పర్ఫెక్ట్
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై తుపాకీతో కాల్పులు..!
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై తుపాకీతో కాల్పులు..!
ఆటలో కోహ్లీని మించిన తోపు.. సెలెక్టర్ల దృష్టిలో పనికిరానోడు
ఆటలో కోహ్లీని మించిన తోపు.. సెలెక్టర్ల దృష్టిలో పనికిరానోడు
10 గ్రాముల బంగారు గొలుసుపై లోన్‌ తీసుకుంటే ఎంత డబ్బు వస్తుంది?
10 గ్రాముల బంగారు గొలుసుపై లోన్‌ తీసుకుంటే ఎంత డబ్బు వస్తుంది?
నిద్రలో ఉన్న భార్యను కాల్చి చంపేందుకు భర్త యత్నం..!
నిద్రలో ఉన్న భార్యను కాల్చి చంపేందుకు భర్త యత్నం..!
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
పవన్ కల్యాణ్‌ను కలిసిన అల్లు అర్జున్! ఆరోగ్య పరిస్థితిపై ఆరా
పవన్ కల్యాణ్‌ను కలిసిన అల్లు అర్జున్! ఆరోగ్య పరిస్థితిపై ఆరా