Parvati Melton: అమ్మబాబోయ్.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పార్వతీ మెల్టన్.. మరీ ఇలా మారిపోయిందేంటీ.!
హీరోయిన్ గా పార్వతి వెన్నెల, గేమ్,అల్లరే అల్లరి, ఫ్లాష్ లాంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. అలాగే సుమంత్ నటించిన మధుమాసం, పవర్ స్టార్ పవన్ కళ్యణ్ నటించిన జల్సా సినిమాలో సెకండ్ హీరోయిన్

పార్వతీ మెల్టన్.. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోయింగ్ గా పలు సినిమాల్లో నటించిన ఈ భామ ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గా సినిమాలు చేసింది. ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్ లో మెరిసింది. హీరోయిన్ గా పార్వతి వెన్నెల, గేమ్,అల్లరే అల్లరి, ఫ్లాష్ లాంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. అలాగే సుమంత్ నటించిన మధుమాసం, పవర్ స్టార్ పవన్ కళ్యణ్ నటించిన జల్సా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. అయితే వీటన్నింటిలో జల్సా సినిమాకు పార్వతికి మంచి పేరు వచ్చింది. అందం అభినయంతో కట్టిపడేసే పార్వతి స్పెషల్ సాంగ్స్ తోనూ అలరించింది. మహేష్ బాబు నటించిన దూకుడు సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది.
ఇక ఈ అమ్మడు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. ఇక చివరిగా యమహా యమా అనే సినిమాలో నటించింది పార్వతి మిల్టన్. ప్రస్తుతం ఈ భామ సినిమాలు చేయకున్నా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ హా ఉంటుంది. పార్వతి ఇండో అమెరికన్. ఆమె తల్లిదండ్రులు భారతీయులే అయినా అక్కడ సెటిల్ అయ్యారు.
ఇక పార్వతి నిత్యం రకరకాల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. పార్వతి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అపట్లో బొద్దుగా ఉండే ఈ భామ ఇప్పుడు సన్నజాజి తీగలా మారిపోయింది. పైగా మొహం లోనూ చాలా మార్పు వచ్చింది. సడన్ గా చూస్తే అసలు ఈమె పార్వతి పార్వతీ మెల్టనేనా అనే డౌట్ వస్తుంది. అంతలా మారిపోయింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..