AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adah Sharma: అరుదైన వ్యాధి బారిన పడిన అదా శర్మ.. చాలా ఇబ్బంది పడుతున్నానంటూ ఎమోషనల్

తొలి సినిమాతోనే అతన క్యూట్ నెస్ తో ఆకట్టుకుంది. ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకోకపోయినా.. ఈ బ్యూటీ తన అందంతో మంచి మార్కులు కొట్టేసింది. కానీ టాలీవుడ్ అదా శర్మ అంతగా సక్సెస్ కాలేదు. హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి బిజీ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. దాంతో సెకండ్ హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది.

Adah Sharma: అరుదైన వ్యాధి బారిన పడిన అదా శర్మ.. చాలా ఇబ్బంది పడుతున్నానంటూ ఎమోషనల్
Adah Sharma
Rajeev Rayala
|

Updated on: Jun 10, 2024 | 11:40 AM

Share

టాలీవుడ్‌లో హీరోయిన్ గా నటించిన చాలా మంది బాలీవుడ్ లో సినిమాలు చేసి అక్కడ సక్సెస్ అయ్యారు. అలాంటి వారిలో అదా శర్మ . డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే తన క్యూట్‌నెస్‌తో ఆకట్టుకుంది. ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకోకపోయినా.. ఈ బ్యూటీ తన అందంతో మంచి మార్కులు కొట్టేసింది. కానీ టాలీవుడ్ అదా శర్మ అంతగా సక్సెస్ కాలేదు. హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి బిజీ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. దాంతో సెకండ్ హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.

మొనీమధ్య ది కేరళ స్టోరీస్ అనే సినిమాతో భారీ హిట్ అందుకుంది. ఈ సినిమా పలు వివాదాల్లో చిక్కుకున్నప్పటికీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే అక్కడ పలు సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తుంది అదా శర్మ. ఆతర్వాత బస్తర్ (ది నక్సల్ స్టోరీ) అనే సినిమా చేసింది. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ.

ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రకరకాల ఫోటోలు , వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ షాకింగ్ కామెంట్స్ చేసింది. అదా శర్మ అరుదైన వ్యాధితో బాధపడుతున్నా అని చేపి షాక్ ఇచ్చింది. పీరియడ్స్ కారణంగా తాను చాలా ఇబ్బంది పడతాను అని తెలిపింది. ఇందుకు కారణం కూడా చెప్పింది. తన హెల్త్ ఇష్యూలకు కారణం తను సినిమాల కోసం చేసిన డైటింగ్ లు అంటోంది ఈ ముద్దుగుమ్మ. కేరళ స్టోరీ సినిమాలో కాలేజీ అమ్మాయిలా కనిపించాలి అందుకోసం బరువు తగ్గాను.. ఆతర్వాత బస్తర్ సినిమా కోసం బరువు పెరిగాను. ఇందుకోసం చాలా డైటింగ్ చేశా.. బరువు తగ్గడం, మళ్లీ పెరగడం, ఆ తర్వాత తగ్గడం వల్ల నా శరీరంలో చాలా మార్పులు వచ్చాయి. దీని వల్ల అనారోగ్యంకు గురయ్యాను. దాంతో నాకు ఎండోమెట్రియోసిస్ సమస్య వచ్చింది. ఈ వ్యాధి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నా.. పీరియడ్స్ నాన్‌స్టాప్‌గా కొనసాగుతూ ఉంటుంది. దాదాపు 48 రోజుల పాటు బ్లీడింగ్ అవుతుంది. దాంతో చాలా ఇబ్బందిపడుతున్నా అని తెలిపింది అదా శర్మ.  ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Adah Sharma (@adah_ki_adah)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఓర్నాయనో.. అతిగా తింటే ఈ వ్యాధులు మూటగట్టుకున్నట్లే..
ఓర్నాయనో.. అతిగా తింటే ఈ వ్యాధులు మూటగట్టుకున్నట్లే..
ఆరోగ్యాన్నిచ్చే అంబలి.. ఇలా చేసి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు!
ఆరోగ్యాన్నిచ్చే అంబలి.. ఇలా చేసి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు!
పిల్లలా.. వద్దు మహాప్రభో.! 20 ఏళ్లు వచ్చేసరికి ఏకంగా..
పిల్లలా.. వద్దు మహాప్రభో.! 20 ఏళ్లు వచ్చేసరికి ఏకంగా..
3, 4 లేదా 5 రెక్కలు.. ఎండాకాలంలో ఏ ఫ్యాన్ గాలి ఎక్కువ వస్తుంది?
3, 4 లేదా 5 రెక్కలు.. ఎండాకాలంలో ఏ ఫ్యాన్ గాలి ఎక్కువ వస్తుంది?
జ్యూసీగా, మంచి రుచిని ఇచ్చే దేశంలోని ఫేమస్ మామిడిపండ్లు ఇవే!
జ్యూసీగా, మంచి రుచిని ఇచ్చే దేశంలోని ఫేమస్ మామిడిపండ్లు ఇవే!
ప్రూఫ్ లేకపోయినా ఆధార్‌లో అడ్రస్ మార్చుకోవడం ఎలా..?
ప్రూఫ్ లేకపోయినా ఆధార్‌లో అడ్రస్ మార్చుకోవడం ఎలా..?
థియేటర్లలో మూడు కోట్ల మంది చూసిన ఏకైక సినిమా..
థియేటర్లలో మూడు కోట్ల మంది చూసిన ఏకైక సినిమా..
మట్టి కుండ కొంటున్నారా? ఈ 4 విషయాలు తెలిస్తే మీ నీళ్లు ఐస్ లాగే
మట్టి కుండ కొంటున్నారా? ఈ 4 విషయాలు తెలిస్తే మీ నీళ్లు ఐస్ లాగే
RGVకి డైరెక్ట్ చేసే అంత సీన్ ఉందా అనుకున్నా.. ఆ తర్వాత.!
RGVకి డైరెక్ట్ చేసే అంత సీన్ ఉందా అనుకున్నా.. ఆ తర్వాత.!
ఇంటర్ పూర్తైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల..
ఇంటర్ పూర్తైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల..