Manchu Manoj: మంచు మనోజ్- మౌనికల కూతురికి బారసాల.. మంచువారమ్మాయికి ఏం పేరు పెట్టారో తెలిస్తే వావ్ అంటారు
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ , భూమా మౌనిక దంపతులు అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. ఏప్రిల్ 13న మంచు మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తెలుపుతూ నటి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఒక స్పెషల్ పోస్ట్ పెట్టింది.

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ , భూమా మౌనిక దంపతులు అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. ఏప్రిల్ 13న మంచు మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తెలుపుతూ నటి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఒక స్పెషల్ పోస్ట్ పెట్టింది. ‘మా ఇంట్లోకి చిన్న దేవత వచ్చింది. అప్పుడే తనకి ఎంఎం పులి అని ముద్దు పేరు కూడా పెట్టామని చెప్పుకొచ్చింది మంచు వారమ్మాయి. . సోమవారం (జులై 8) మంచు వారమ్మాయికి ఘనంగా నామకరణ వేడుక నిర్వహించారు. మోహన్‌బాబు దంపతులతో పాటు మౌనిక రెడ్డి కుటుంబసభ్యులు ఉన్నారు దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు మనోజ్. ఇంతకీ పాపకు ఏం పేరు పెట్టారో తెలుసా?.. ‘దేవసేన శోభ ఎం ఎం’. ‘ ఆ పరమేశ్వరుడి దయతో, మీ అందరి ప్రేమతో మా పాపకు ఈ పేరు పెట్టాం. మీ అందరి ప్రేమాభిమానాలు, దీవెనలు కావాలి. శివ భక్తుడిగా.. సుబ్రహ్మణ్య స్వామి భార్య పేరు వచ్చేలా ‘దేవసేన’ అని నామకరణం చేశాం’. అలాగే మా అత్తగారు (మౌనిక తల్లి) శోభానాగిరెడ్డి పేరు వచ్చేలా ‘శోభా’ అని యాడ్ చేశాం.’వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మా కుటుంబంపై ఉంటాయి’
‘మా జీవితంలో ఎల్లప్పుడూ అండగా ఉంటూ.. మాకు కొండంత బలంగా నిలుస్తున్న మా తల్లిదండ్రులు మోహన్ బాబు, నిర్మలా దేవిల ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉంటాయి. ఇక నా జీవితంలో మొదటి నుంచి ప్రతి విషయంలో నాకు తోడుగా ఉంటున్న మా అక్క లక్ష్మీ మంచుకు ప్రత్యేక ధన్యవాదాలు’ అంటూ ఒక ఎమోషనల్ లెటర్ కూడా షేర్ చేశాడు మనోజ్. ప్రస్తుతం మంచు మనోజ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫొటోలు చాలా క్యూట్ గా ఉన్నాయి. అలాగే మంచు వారమ్మాయి పేరు కూడా ఎంతో బాగుందంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
బారసాల వేడుకలో మోహన్ బాబు దంపతులు..
With all Your’s & Lord Shiva’s blessings, we named our Daughter 🙏🏼❤️ #DevasenaShobhaMM pic.twitter.com/n6dvJeDoVR
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) July 8, 2024
మిరాయ్ సినిమాలో మంచు మనోజ్..
He is coming back Mightier, Stronger, Deadlier
Wishing a very Happy Birthday to Rocking Star #ManojManchu garu#TheBlackSword is herehttps://t.co/UqGMLJZjOA#MIRAI ⚔️@peoplemediafcy pic.twitter.com/nTfSmQfLPL
— Teja Sajja (@tejasajja123) May 20, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.