Kiran Abbavaram: తిరుమల శ్రీవారి సేవలో హీరో కిరణ్ అబ్బవరం..సెల్ఫీల కోసం ఎగబడిన భక్తులు.. వీడియో చూడండి

|

Oct 27, 2024 | 4:44 PM

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇటీవల హీరోయిన్ రహస్య గోరఖ్ తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడీ హ్యాండ్సమ్ హీరో. అలాగే తన మొదటి పాన్ ఇండియా సినిమా క కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Kiran Abbavaram: తిరుమల శ్రీవారి సేవలో హీరో కిరణ్ అబ్బవరం..సెల్ఫీల కోసం ఎగబడిన భక్తులు.. వీడియో చూడండి
Kiran Abbavaram
Follow us on

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం (అక్టోబర్ 27)ఉదయం ఆయన వేంకటేశ్వర స్వామి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయాధికారులు కిరణ్ అబ్బవరం కు సాదర స్వాగతం పలికారు. ఇక దర్శనానంతరం హీరోకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తన లేటెస్ట్ మూవీ క సూపర్ హిట్ కావాలని శ్రీవారిని కోరుకున్నానని కిరణ్ అబ్బవరం తెలిపాడు. కాగా ఈ హీరో రాకను గమనిచిన భక్తులు అతనితో ఫొటోలు, సెల్పీలు దిగేందుకు ఎగబడ్డారు. కిరణ్ కూడ ఎంతో ఓపికగా అడిగిన వారందరితో ఫొటోలు దిగాడు. సెల్ఫీలు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గతేడాది ఏకంగా మూడు సినిమాలతో ఆడియెన్స్ ను పలకరించాడు కిరణ్ అబ్బవరం. వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్, రూల్స్ రంజన్ సినిమాలు రిలీజ్ చేయగా, వినరో భాగ్యము విష్ణు కథ ఒక్కటే డీసెంట్ హిట్ గా నిలిచింది. మిగిలిన రెండు సినిమాలు తీవ్రంగా నిరాశపర్చాయి.

ఈ క్రమంలోనే కొద్దిగా గ్యాప్ తీసుకుని ఏకంగా పాన్ ఇండియా సినిమాతో మన ముందుకు వస్తున్నాడు కిరణ్ అబ్బవరం. పీరియాడిక్ థ్రిల్లర్ గా రూపొందిన క సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై కూడా పాజిటవ్ బజ్ క్రియేట్ అయ్యింది. క సినిమాలో కిరణ్ అబ్బవరం పోస్ట్ మ్యాన్‌గా కనిపించనున్నాడు. కిరణ్ సరసన నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లు గా నటించారు. ఈ సినిమాకు సుజీత్, సందీప్ దర్శకులుగా వ్యవహరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ హౌస్ లో  నాగార్జునతో హీరో కిరణ్ అబ్బవరం..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..