Tollywood: సూపర్ ఫామ్‌లో టాలీవుడ్ డైరెక్టర్స్.. మెమరబుల్ హిట్స్ అందుకుంటున్న తమిళ్ హీరోలు

తెలుగు దర్శకులు, తమిళ హీరోలతో మెమరబుల్ హిట్స్ ఇస్తున్నారు. సౌత్ ఇండస్ట్రీలో రీసెంట్ సెన్సేషన్‌ సార్‌. ధనుష్ హీరోగా వెంకీ అట్లూరీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రికార్డులు తిరగరాస్తోంది.

Tollywood: సూపర్ ఫామ్‌లో టాలీవుడ్ డైరెక్టర్స్.. మెమరబుల్ హిట్స్ అందుకుంటున్న తమిళ్ హీరోలు
Tollywood
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 25, 2023 | 8:34 PM

పాన్ ఇండియా ట్రెండ్‌లో లాంగ్వేజ్ బారియర్స్ చెరిగిపోయాయి. దీంతో రీజినల్ సినిమాల్లోనూ క్రాసోవర్ కాంబినేషన్స్‌ కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు దర్శకులు, తమిళ హీరోలతో మెమరబుల్ హిట్స్ ఇస్తున్నారు. సౌత్ ఇండస్ట్రీలో రీసెంట్ సెన్సేషన్‌ సార్‌. ధనుష్ హీరోగా వెంకీ అట్లూరీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రికార్డులు తిరగరాస్తోంది. లేటెస్ట్‌గా ధనుష్ కెరీర్‌లోనే హయ్యస్ట్‌ గ్రాసర్‌గా నిలిచింది సార్‌. ప్రజెంట్ మాస్ ట్రెండ్‌లో ఉన్న ధనుష్‌ను క్లాస్ మాస్టర్‌గా చూపించి సూపర్ హిట్ అందుకున్నారు దర్శకుడు వెంకీ అట్లూరి.

తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిన సార్‌ రెండు భాషల్లోనూ ఘనవిజయం సాధించింది. ఈ మధ్య వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో ఉన్న ధనుష్ కెరీర్‌ను తిరిగి గాడిలో పెట్టింది సార్‌. ఈ మూవీ సక్సెస్‌ మీద ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్న ధనుష్‌… రిలీజ్‌ కాకముందే మరో టాలీవుడ్ డైరెక్టర్‌ శేఖర్ కమ్ములకి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన వారసుడు కూడా బ్లాక్ బస్టర్స్ లిస్ట్‌లో చేరింది. ఏకంగా 300 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ మూవీ విజయ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ సరసన చేరింది. ఇలా తెలుగు దర్శకులు అంతా సూపర్ ఫామ్‌లో ఉండటంతో మరికొంత మంది తమిళ హీరోలు కూడా టాలీవుడ్ డైరెక్టర్స్‌తో టచ్‌లోకి వస్తున్నారు.

ఈ ఫార్ములా అందరి విషయంలో వర్క్ అవుట్ కావటం లేదు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ రూపొందించిన ప్రిన్స్ మాత్రం అనుకున్న స్థాయిలో పెర్ఫామ్ చేయలేదు. శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో పర్వాలేదనిపించినా.. తమిళనాట పూర్తిగా ఫెయిల్ అయ్యింది. ఓవరాల్‌గా సక్సెస్‌ రేటే ఎక్కువగా ఉండటంతో తెలుగు దర్శకులకు కోలీవుడ్‌లో మంచి డిమాండ్‌ ఏర్పాడుతోంది.