టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ఇటీవల వరుస విషాదాలతో టాలీవుడ్ శోకసంద్రంగా మారింది. ఇటీవలే లెజెండ్రీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణను కోల్పోయిన టాలీవుడ్ తాజాగా మరో దర్శకుడిని కూడా పోగొట్టుకుంది. ప్రముఖ డైరెక్టర్ మదన్ కన్నుమూశారు. అనారోగ్యంతో దర్శకుడు మదన్ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా మదన్ అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుస్తోంది. ఇక నాలుగు రోజుల కిందట బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. దీంతో అతన్ని అసుపత్రిలో చేర్పించారు.
చికిత్స పొందుతూ డైరెక్టర్ మదన్ మృతిచెందారు. బ్రెయిన్ స్ట్రోక్ కు గురైన మదన్… హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ… కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. ఈయన స్వస్థలం మదనపల్లి. రాజేంద్రప్రసాద్ నటించిన ఆ నలుగురు సినిమాకు మదన్ రచయితగా పనిచేశారు. ‘పెళ్లయిన కొత్తలో’ సినిమాతో దర్శకుడిగా మారిన మదన్.. ఆ తర్వాత గుండె ఝల్లు మంది, ప్రవరాఖ్యుడు..గరం, గాయత్రి సినిమాలకు దర్శకత్వం వహించారు. మదన్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.డైరెక్టర్ మదన్ ని ఆఖరిగా చూడాలి అని అంటే ఈ రోజు మధ్యాహ్నము 12 .00 గంటల నుంచి ఫిలింనగర్ మహాప్రస్థానము కి రావచ్చు 3 తరవాత అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.