ఒకటో రెండో సీన్లు అయితే చేయను అన్నాడు.. అందుకే నా సినిమాల్లో అతను లేడు.. అసలు విషయం చెప్పిన అనిల్ రావిపూడి
సంక్రాంతికి తెలుగులో సినిమాల జాతర సాగనుంది. ఈ ఏడాది పండక్కి విడుదల కానున్న చిత్రాల్లో మన శంకరవరప్రసాద్ గారు ఒకటి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలోచిరు జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుంది.

ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, వీడియోలు, టీజర్, ట్రైలర్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. కాగా గతంలో అనిల్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అనిల్ మాట్లాడుతూ.. ఎఫ్2 విజయం తర్వాత తన గురించి ఎదురైన సవాళ్లు ప్రత్యేకంగా మాట్లాడారు. తనకు నవ్వడం సహజ స్వభావమని, స్కూల్, కాలేజీ రోజుల నుంచే జోకులు వేస్తూ, నవ్వుతూ ఉండేవాడినని అన్నారు. నవ్వు తన జీవితంలో, విజయంలో ఒక ముఖ్యమైన భాగమని, అది బాధను దూరం చేస్తుందని, మనుషులను దగ్గర చేస్తుందని, గొడవలను ఆపి గౌరవాన్ని పెంచుతుందని దాన్ని నేను బలంగా నమ్ముతాను అని అన్నారు. సరైన సందర్భంలో లేని నవ్వు ఇబ్బందికరంగా ఉంటుందని, తాను ఎప్పుడూ అలాంటి పొరపాటు చేయనని అనిల్ రావిపూడి స్పష్టం చేశారు.
అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన కాలంలో ఎదురైన అనుభవాలను పంచుకుంటూ.. తాను ఆండ్రాయిడ్ లాగా యూజర్ ఫ్రెండ్లీ అని అన్నారు. రైటర్‌గా, అసోసియేట్ డైరెక్టర్‌గా ఒకేసారి పనిచేసినప్పుడు, నటులు తనతో ఎక్కువ సమయం గడిపేవారని అన్నారు. దీనివల్ల నటుల నుంచి ఎప్పుడూ అవమానాలు ఎదుర్కోలేదని, చాలా మంది నటులు తనతో సన్నిహితంగా ఉండేవారని తెలిపారు. నటుడు శ్రీనివాస్ రెడ్డి తన సినీ ప్రయాణం అంతటా అత్యంత సన్నిహిత మిత్రుడని, అందుకే తన సినిమాలలో ఆయనకు ఎప్పుడూ ప్రత్యేక పాత్రలు ఉంటాయని చెప్పారు. అలాగే సప్తగిరితో తన స్నేహం గురించి మాట్లాడుతూ..
సప్తగిరి తన అత్యంత ఆప్తమిత్రుడని పేర్కొన్నారు. కందిరీగ సినిమా కోసం తాను రాసుకున్న ట్రాక్‌ను మొదట తానే చేయాలనుకున్నానని, అయితే అది తన ప్రొఫెషన్ కాదని గ్రహించి, అప్-కమింగ్ నటుడికి అవకాశమివ్వాలని సప్తగిరికి ఫోన్ చేసి ఇచ్చానని గుర్తు చేసుకున్నారు. సప్తగిరి తన సినిమాలలో ఎక్కువగా కనిపించకపోవడానికి కారణం ఉందని.. ఒకటో రెండో సీన్లు అయితే చేయను అని సప్తగిరి అనడమేనని, అలా పూర్తి నిడివి గల పాత్ర కుదరడం లేదని అనిల్ అన్నారు. లెజెండరీ హాస్యనటుడు బ్రహ్మానందంతో పనిచేయలేకపోవడం తన కెరీర్‌లో ఒక పెద్ద లోటుగా అనిల్ రావిపూడి అన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచీ బ్రహ్మానందం తన పట్ల ఆప్యాయంగా ఉండేవారని, అయితే పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ వంటి చిత్రాలలో సరైన పాత్రలు కుదరకపోవడంతో ఆయనతో కలిసి పనిచేయలేకపోయానని అన్నారు అనిల్ రావిపూడి. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.
