TOP 9 ET News: నెంబర్ 1 హీరోగా ప్రభాస్.. || హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక విక్రమ్ రియాక్షన్..!
ఇలాంటి ఎన్నో టాలీవుడ్ టాప్ న్యూస్, బ్రేకింగ్ అప్‌డేట్స్‌తో పాటు సినిమా రిలీజ్‌లకు సంబంధించిన సమాచారాన్ని క్విక్‌గా తెలుసుకోవాలని ఉందా.. మరి ఇంకెందుకు ఆలస్యం..

ఎనర్జటిక్ స్టార్ రామ్ బైలింగ్యువల్ మూవీ ది వారియర్ జూలై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. నితిన్ హీరోగా రానున్న మాచర్ల నియోజికవర్గం సినిమా నుంచి మాస్ మాసాలా సాంగ్ రిలీజ్ అయ్యింది. ఇలాంటి ఎన్నో టాలీవుడ్ టాప్ న్యూస్, బ్రేకింగ్ అప్‌డేట్స్‌తో పాటు సినిమా రిలీజ్‌లకు సంబంధించిన సమాచారాన్ని క్విక్‌గా తెలుసుకోవాలని ఉందా.. మరి ఇంకెందుకు ఆలస్యం.. టాప్ 9 న్యూస్‌ని తెలుసుకోండి..
1. The Warrior: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన బైలింగ్యువల్ మూవీ ది వారియర్. తమిళ దర్శకుడు లింగుసామి డైరెక్ట్ చేసిన ఈ సినిమా జూలై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే జేఆర్సీ కన్వెన్షన్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తాజాగా ఏర్పాటు చేసింది ఈ మూవీ టీం. ఇక ఈ ఈవెంట్ మిస్ కాకుండా చూడాలంటే.. ప్లీజ్ సబ్ స్క్రైబ్ టూ.. టీవీ9 ఎంటర్ టైన్మెంట్ ఛానెల్.
2.Macherla: మాచర్ల నియోజికవర్గం సినిమా నుంచి మాస్ మాసాలా సాంగ్ రిలీజ్ అయ్యింది. నితిన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో అంజలి స్పెషల్ సాంగ్‌లో ఆడి పాడారు. రా రా రెడ్డి అంటూ సాగే ఈ పాటను లిప్సిక ఆలపించారు. మహతి స్వర సాగర్ సంగీతమందించగా కాసర్ల శ్యామ్ సాహిత్యమందించారు.




3. My Dear Bhootham: ప్రభుదేవ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఫాంటసీ మూవీ మై డియర్ భూతమ్. అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రమేష్ పి పిళ్లై నిర్మించిన ఈ సినిమా జూలై 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన మేకర్స్… ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
4.The Ghost: నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ ది ఘోస్ట్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన మేకర్స్ టీజర్‌ను రిలీజ్ చేశారు.
5. Vignesh: కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్ తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశారు. జూన్ 9న స్టార్ హీరోయిన్ నయనతారను కొద్ది మంది సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకున్న విఘ్నేష్. ఇప్పుడు తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఒక్కక్కొటిగా షేర్ చేస్తున్నారు. వాటితో నెట్టింట వైరల్ అవుతున్నారు.
6. Shaktimaan: సూపర్ హిట్ టెలివిజన్ సీరిస్ శక్తిమాన్ త్వరలో సినిమాగా రూపొందనుంది. తానాజీ, ఆదిపురుష్ లాంటి విజువల్ వండర్స్‌ను రూపొందించిన ఓం రవుత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఐకానిక్ దేశీ సూపర్ హీరో క్యారెక్టర్‌లో రణవీర్ సింగ్ నటిస్తున్నారనే టాక్ ప్రస్తుతం బీ టౌన్‌లో వైరల్ అవుతోంది.
7. Shamshera: రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా షంషేరా. జూలై 22న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. యూ బై ఏ సర్టిఫికేట్‌ను జారీ చేసింది సెన్సార్ బోర్ట్. పీరియాడిక్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమా 2 గంటల 38 నిమిషాల రన్ టైమ్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
8. Vikram: ఇటీవల అనారోగ్యానికి గురైన విక్రమ్, అభిమానుల కోసం వీడియో మేసేజ్ రిలీజ్ చేశారు. తన మీద చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు విక్రమ్. ఈ వీడియోలో విక్రమ్ పూర్తి ఆరోగ్యంగా ఉత్సాహంగా కనిపించటంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈవీడియోను నెట్టింట వైరల్ చేస్తున్నారు.
9. Prabhas: ట్విట్టర్‌లో మరో సారి ట్రెండ్ అవుతున్నారు డార్లింగ్ ప్రభాస్. తనను పాన్ ఇండియన్ హీరోగా నిలబడేలా చేసిన జక్కన్న ఫిల్మ్ బాహుబలి.. ఈ రోజుతో 7 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా, డార్లింగ్ ట్రెండ్ అవుతున్నారు. మరో సారి నెంబర్ వన్ హీరో అనే టాక్ ను రాబట్టుకుంటున్నారు