Rachana Banerjee: పార్లమెంట్ ఎన్నికల బరిలో ‘కన్యాదానం’ హీరోయిన్.. పోటీ ఎక్కడినుంచంటే?
సార్వత్రిక ఎన్నికలకు సమయం ముంచుకొస్తుంది. మరికొన్ని రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్, షెడ్యూల్ వెలువడనుంది. దీంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికలో తలమునకలవుతున్నాయి. ఇదే సమయంలో పలువురు స్టార్ హీరోయిన్లు, క్రికెటర్లు పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు
సార్వత్రిక ఎన్నికలకు సమయం ముంచుకొస్తుంది. మరికొన్ని రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్, షెడ్యూల్ వెలువడనుంది. దీంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికలో తలమునకలవుతున్నాయి. ఇదే సమయంలో పలువురు స్టార్ హీరోయిన్లు, క్రికెటర్లు పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ లోని 14 లోక్ సభ స్థానాలకు సీఎం మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ అర్చనా బెనర్జీ పేరు కూడా ఉంది. హుగ్లీ లోకసభ స్థానం నుంచి ఆమె బరిలోకి దిగనుంది. బెంగాల్ కు చెందిన రచనా బెనర్జీ.. టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా సుపరిచితం. బావగారు బాగున్నారా, పిల్ల నచ్చింది, మావిడాకులు, సుల్తాన్, కన్యాదానం లాహిరి లాహిరి లాహిరిలో తదితర హిట్ సినిమాల్లో రచన హీరోయిన్ గా నటించింది. అలాగే బెంగాలీ, తమిళం, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసి అక్కడి ప్రేక్షకుల మెప్పు పొందింది. ప్రస్తుతం బెంగాలీ సీరియల్స్ తో పాటు టీవీ రియాల్టీ షోలకు యాంకర్, జడ్జిగానూ వ్యవహరిస్తోంది. ఇప్పుడు మొదటి సారిగా పార్లమెంట్ ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అయ్యిందీ అందాల తార.
తెలుగులో చివరిగా లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలో నటించింది రచనా బెనర్జీ. బెంగాలీలో 50కు పైగా సినిమాలు చేసిన ఆమెకు అక్కడ మంచి గుర్తింపు ఉంది. అంతేకాదు బెంగాలీలో దీదీ నంబర్.1 గేమ్‍షోకు చాలా ఏళ్లపాటు యాంకర్‌గా వ్యవహరించిందామె . ఈ షో కారణంగానే దీదీ నంబర్ వన్‍గా ప్రజల్లో బాగా క్రేజ్ సంపాదించుకుందామె. ఇప్పుడిదే పాపులారిటీతో పాలిటిక్స్ లోకి అడుగుపెడుతోంది. మరి సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన రచనా బెనర్జీ రాజకీయాల్లో ఏ మేర సక్సెస్ అవుతుందో చూడాలి.
మమతా బెనర్జీతో రచనా బెనర్జీ..
Runs a show called Didi No. 1 selling the distress of women in name of empowerment.
Stays quiet during Sandeshkhali.
Meet Rachana Banerjee, TMC Candidate from Hooghly pic.twitter.com/ClUXyIxG36
— Sudhanidhi Bandyopadhyay (@SudhanidhiB) March 10, 2024
టీవీ షోలో దీదీతో టాలీవుడ్ హీరోయిన్..
মুখ্যমন্ত্রী মমতা বন্দ্যোপাধ্যায় বানালেন পারফেক্ট রুটি! রাজ্য সামলানোর পাশাপাশি, ঘরের কাজেও পারদর্শী আমাদের মাননীয়া মুখ্যমন্ত্রী মমতা বন্দ্যোপাধ্যায়। সত্যিই বাংলার ‘দিদি নম্বর ১’!#BanglarGorboMamata #DidiNo1 #MamataBanerjee #RachanaBanerjee#ZeeBangla pic.twitter.com/WsmmLO5GeF
— Banglar Gorbo Mamata (@BanglarGorboMB) March 3, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి