Oscar Awards 2024: అట్టహాసంగా ఆస్కార్ అవార్డుల వేడుక.. విజేతలు వీరే.. ఆ సినిమాకే పట్టం

సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే 96వ ఆస్కార్‌ అవార్డుల వేడుక ఘనంగా ప్రారంభమైంది. అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌ డాల్బీ థియేటర్‌ వేదికగా 96వ అకాడమీ అవార్డుల కార్యక్రమం జరుగుతోంది. గత ఏడాది ట్రిపులార్ సాంగ్‌కు ఆస్కార్‌ బరిలో అవార్డు రావటంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ వేడుకకు బాగా కనెక్ట్ అయ్యారు

Oscar Awards 2024: అట్టహాసంగా ఆస్కార్ అవార్డుల వేడుక.. విజేతలు వీరే.. ఆ సినిమాకే పట్టం
Oscar Awards 2024
Follow us

|

Updated on: Mar 11, 2024 | 7:37 AM

సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే 96వ ఆస్కార్‌ అవార్డుల వేడుక ఘనంగా ప్రారంభమైంది. అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌ డాల్బీ థియేటర్‌ వేదికగా 96వ అకాడమీ అవార్డుల కార్యక్రమం జరుగుతోంది. గత ఏడాది ట్రిపులార్ సాంగ్‌కు ఆస్కార్‌ బరిలో అవార్డు రావటంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ వేడుకకు బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే ఈ ఏడాది ఇండియన్ మూవీస్ ఏవీ, కాంపిటీషన్‌లో లేకపోయినా… ఇక్కడ కూడా బజ్‌ మాత్రం బాగానే ఉంది..అయిలే ఇప్పటి వరకు పలు విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. ముందు నుంచి ఊహించినట్టుగానే హాలీవుడ్ మూవీ ఓపెన్‌ హైమర్ ఆస్కార్ బరిలో సత్తా చాటింది. మేజర్ కేటగిరీల్లో అవార్డులు సాధించింది ఈ మూవీ. 13 కేటగిరీల్లో పోటికి నిలిచిన ఈ సినిమా చాలా కేటగిరీల్లో అవార్డులు దక్కాయి. బెస్ట్ సపోర్టింగ్ రోల్‌, బెస్ట్ ఎడిటింగ్‌, బెస్ట్ సినిమాటోగ్రఫి లాంటి కేటగిరీల్లో ఈ సినిమా అవార్డులు సాధించింది. ఇండియా నుంచి డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం కేటగిరీలో అవార్డు బరిలో నిలిచిన ‘టు కిల్‌ ఏ టైగర్‌’కు నిరాశే మిగిలింది. ఈ కేటగిరిలో 20 డేస్‌ ఇన్ మారిపోల్‌ డాక్యుమెంటరీకి అవార్డు దక్కింది. రష్యా-ఉక్రేయిన్‌ వార్ నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలింను రూపొందించారు.డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరీలో ది లాస్ట్ రిపేర్‌ షాప్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ కేటగిరీలో గాడ్జిల్లా మైనస్‌ వన్‌, ఇంటర్నేషనల్‌ ఫీచల్‌ ఫిలిం కేటగిరీలో ది జోన్ ఆఫ్ ఇంట్రస్ట్ సినిమా అవార్డులు సాధించాయి..మెయిన్ కేటగిరీస్‌కు సంబంధించిన అవార్డులు ఇంకా ప్రకటించాల్సి ఉంది.

ఇప్పటివరకు ప్రకటించిన అవార్డుల జాబితా..

  • ఉత్తమ సహాయ నటుడు: రాబర్ట్ డౌనీ జూనియర్ (ఓపెన్ హైమర్)
  • ఉత్తమ సహాయ నటి: డేవైన్‌ జో రాండాల్ఫ్‌ (ది హోల్డోవర్స్‌)
  • బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: ది బాయ్‌ అండ్‌ ది హిరాన్‌
  • ఉత్తమ కాస్టూమ్‌ డిజైన్‌: హోలి వెడ్డింగ్‌టన్‌ (పూర్ థింగ్స్‌)
  • బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌: జేమ్స్‌ ప్రైస్‌, షోనా హెత్‌ (పూర్‌ థింగ్స్‌)
  • బెస్ట్‌ హెయిర్‌ స్టయిల్‌ అండ్‌ మేకప్‌: నడియా స్టేసీ, మార్క్‌ కౌలియర్‌ (పూర్‌ థింగ్స్‌)
  • బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ ప్లే: కార్డ్ జెఫర్‌పన్‌ (అమెరికన్‌ ఫిక్షన్‌)
  • బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే: జస్టిన్‌ ట్రైట్‌, అర్థర్‌ హరారీ (అనాటమీ ఆఫ్‌ ఎ ఫాల్‌)
  • ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌: ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌
  • ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్: ద లాస్ట్ రిపేర్ షాప్ (బెన్ ఫ్రౌడ్‌ఫుట్, క్రిస్ బ్రోవర్స్)
  • ఉత్తమ సినిమాటోగ్రాఫర్: హెయటే వన్ హోయటేమా (ఓపెన్ హైమర్)
  • ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: గాడ్జిల్లా మైనస్ వన్ (తకాషి యమజాకీ, క్యోకో షిబుయా, మకాషి తకషాకీ, తత్సుజీ నోజిమా)
  • ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: ఓపెన్ హైమర్ (జెన్నీఫర్ లేమ్
  • ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: 20 డేస్ ఇన్ మరియూపోల
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఓపెన్ హైమర్ (హోయటే, హోయటేమ)
  • ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ద వండర్‌ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి