AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gaami: యూఎస్ఏలో  విశ్వక్ సేన్ ‘గామి’ సరికొత్త రికార్డ్.. కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్

విశ్వక్ సేన్ 'గామి' యూఎస్ఏలో 500 వేల డాలర్ల మైలురాయి దిశగా దూసుకెళ్తోంది. విశ్వక్ సేన్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ "గామి" మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది. విజువల్ గా అద్భుతమైన ఈ కళాఖండం ప్రేక్షకులు, విమర్శకుల నుండి ప్రశంసలను అందుకుంది.

Gaami: యూఎస్ఏలో  విశ్వక్ సేన్ 'గామి' సరికొత్త రికార్డ్.. కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్
Gami
Balu Jajala
|

Updated on: Mar 11, 2024 | 7:51 AM

Share

విశ్వక్ సేన్ ‘గామి’ యూఎస్ఏలో 500 వేల డాలర్ల మైలురాయి దిశగా దూసుకెళ్తోంది. విశ్వక్ సేన్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ “గామి” మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది. విజువల్ గా అద్భుతమైన ఈ కళాఖండం ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. మంచి రివ్యూస్ ను కూడా సొంతం చేసుకుంది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల గ్రాస్ వసూలు చేసి విశ్వక్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ గా నిలిచిన చిత్రంగా ‘గామి’ రికార్డులను బద్దలు కొట్టింది.

ఒక్క ఉత్తర అమెరికాలోనే, ఈ చిత్రం ప్రీమియర్స్ గ్రాస్ తో పాటు మొదటి 2 రోజుల్లో $400K కంటే ఎక్కువ వసూలు చేసింది. డిస్ట్రిబ్యూషన్ సంస్థ అయిన “శ్లోకా ఎంటర్ టైన్ మెంట్స్”కు యుఎస్ఎ, కెనడా ప్రేక్షకుల నుండి అపూర్వమైన స్పందన లభించింది. వీకెండ్ నాటికి “గామి” $500K మార్కును దాటడానికి సిద్ధంగా ఉంది.

విద్యాధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అసాధారణ కళానైపుణ్యానికి తెలుగు ప్రేక్షకుల ఫిదా అయ్యారు. 6 సంవత్సరాల అంకితభావం, కృషి ఫలితంగా గామి సక్సెస్ కొట్టింది. గామి సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపుతున్నారు. అఘోరా అవతారంలో విశ్వక్ సేన్ కెరీర్ ను నిర్వచించే నటన, విద్యాధర్ కగితా అద్భుతమైన దర్శకత్వం, నరేష్ కుమరన్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, డిఓపి విశ్వనాథ్ రెడ్డి సిహెచ్ అద్భుతమైన విజువల్స్ తో తెరకెక్కిన “గామి” ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా చేస్తోంది. మరచిపోలేని సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తుంది.

‘డ్యూన్ 2’, ‘కుంగ్ ఫూ పాండా 4’ వంటి హాలీవుడ్ చిత్రాల కారణంగా శ్లోకా ఎంటర్ టైన్ మెంట్స్ అడ్డంకులు ఎదురైనా యూఎస్ ఏ అంతటా అదనపు షోలు వేయడంతో గామి పాజిటివ్ ట్రెండ్ ఊపందుకుంది. నార్త్ అమెరికా రీజియన్ లో హీరో విశ్వక్ సేన్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

Follow Us