AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచయాత్రికుడి పై టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. అతని వల్లే ఇదంతా అంటూ..

అన్వేష్.. ట్రావెలింగ్ అండ్ టూరిజం లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. 2019లో ‘నా అన్వేషణ’ అనే ఓ యూట్యూబ్ చానెల్ ను ప్రారంభించాడు. అప్పటి నుంచి ప్రపంచం మీద దండయాత్ర చేయడం మొదలు పెట్టాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఇప్పటి వరకు ఏకంగా 85 దేశాలు తిరిగాడు. ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. తను చూడటమే కాదు, తన యూట్యూబ్ చానెల్ ద్వారా ఇక్కడి వాళ్లకు అక్కడి విశేషాలను చూపిస్తున్నాడు కూడా. ప్ర

ప్రపంచయాత్రికుడి పై టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. అతని వల్లే ఇదంతా అంటూ..
Naa Anveshana
Rajeev Rayala
|

Updated on: Mar 30, 2025 | 9:15 AM

Share

ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచమంతా తిరుగుతూ.. ప్రజలకు ఆ దేశ విశేషాలను.. అక్కడి సంస్కృతిని తెలుపుతూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. నా అన్వేషణ గురించి తెలియని వారు సోషల్ మీడియాలో ఉండరు. విశాఖపట్టణానికి చెందిన యాసతో వీడియోలు చేస్తూ అభిమానులను సొంతం చేసుకున్నాడు అన్వేష్. రకరకాల దేశాలు తిరుగుతూ.. అక్కడి ఆహార విధానాలను డిఫరెంట్ వంటకాలను కూడా పరిచయం చేశాడు అన్వేష్. నా అన్వేషణ కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందుకే ఆయన అంత ఫెమస్ అయ్యాడు. చాలా మందికి తెలియని విషయాలను తన వీడియోల ద్వారా తెలియజేస్తూ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో సందడి చేస్తుంటాడు అన్వేష్. ఆటగాడు, సవక అనే పదాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.

ఇక ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ పై పెద్ద యుద్ధమే చేస్తున్నాడు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న కొంతమంది యూట్యూబర్స్ ను ఏకిపారేస్తున్నాడు. ఎవరెవరు ఏం స్కామ్ చేశారో కూడా బయటపెడుతున్నాడు అన్వేష్. యూట్యూబర్స్ తో పాటు కొంతమంది సినిమా తారలు కూడా ఉన్నారు. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు, సినీ ప్రముఖులపై కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇప్పటికే చాలామంది సినీ సెలబ్రిటీలు విచారణకు హాజరయ్యారు.

ఇదిలా ఉంటే తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ నా అన్వేషణ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. మాధవి లత నా అన్వేషణ పై ఫైర్ అయ్యింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి అసలు కారణం ఇతడే.. అంటూ ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేసింది మాధవి లత. మాధవి లత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో కొన్ని సినిమాలు చేసింది. ఆతర్వాత రాజకీయపార్టీలో చేరింది. అలాగే సోషల్ మీడియాలో సమాజంలో జరిగే విషయాలపై స్పందిస్తూ ఉంటుంది. తాజాగా “ఏ వ్యక్తి అయితే బెట్టింగ్ తప్పు అని అంటున్నాడో.. అదే వ్యక్తి మీరు కూడా విదేశాలకి వస్తే పాపలతో తిరగవచ్చు. మీరు కూడా విదేశాలకు వస్తే ఈ పిచ్చి మీద బ్యాటింగ్ చేయొచ్చు.. అని చెబుతున్నారు అని మాధవి లత అన్నారు. అలాగే ” మీరు కూడా విదేశాలకు వస్తే ఈ పిచ్చి మీద బ్యాటింగ్ చేయొచ్చు.. అని చెప్తున్నారు. ఇతని మాటలు ఏం నేర్పుతున్నాయి. ఇది ఎలా కరెక్టు.. ఇప్పుడు ఈ వీడియోను చూసే ఫాలోవర్స్ నన్ను అమ్మనా బూతులు తిడతారు. అయినా నాకేం ప్రాబ్లం లేదు. నేను నిజాన్ని నిర్భయంగా చెబుతాను. ఆ వీడియోలు చూసిన ఎవరైనా సరే.. ఓహో ఫారిన్ కంట్రీస్ కి వెళ్తే మనం కూడా పాపలతో తిరుగొచ్చు కదా..  ఆలోచనలు వస్తాయి. డబ్బు కావాలంటే ఈజీగా బెట్టింగ్ యాప్స్ వాడి డబ్బులు సంపాదించ వచ్చు, మనం కూడా ఈజీగా డబ్బు సంపాదించుకుంటే లగ్జరీగా బ్రతికేయొచ్చు. వేరే ప్రాంతాలకు వెళ్లొచ్చు. వేరే కంట్రీస్ పాపలతో తిరగవచ్చు అని ఆలోచనలో పడి ఆ బెట్టింగ్ యాప్స్ లో డబ్బు పెడతాడు. దాంతో ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల డబ్బులు పోగొట్టుకొని, చివరకు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అంటూ మాధవి లత తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..