AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maha Kumbh Mela: మహా కుంభమేళాలో మెరిసిన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. గంగానదిలో పవిత్ర స్నానం.. ఫొటోస్ వైరల్

ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ వేదికగా జరుగుతోన్న మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు వస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఈ ఆధ్యాత్మిక వేడుకకు తరలివెళుతున్నారు. ఇందులో సినిమా తారలు కూడా ఉన్నారు.

Maha Kumbh Mela: మహా కుంభమేళాలో మెరిసిన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. గంగానదిలో పవిత్ర స్నానం.. ఫొటోస్ వైరల్
Maha Kumbh Mela
Basha Shek
|

Updated on: Feb 06, 2025 | 8:26 AM

Share

ప్రపంచంలో అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకగా గుర్తింపు పొందిన ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా అప్రతిహతంగా కొనసాగుతోంది. జనవరి 13న అట్టహాసంగా ప్రారంభమైన ఈ వేడుక ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. ఇప్పటికే దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు మహా కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించారు. సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా ఈ ఆధ్యాత్మిక వేడుకలో భాగమవుతున్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు మహా కుంభమేళాలో పాల్గొంటున్నారు. పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం తమ ఆధ్యాత్మిక యాత్ర కు సంబంధించిన ఫొటోలు, విశేషాలను అందరితో షేర్ చేసుకుంటున్నారు. పూనమ్ పాండే, యాంకర్ లాస్య, హేమమాలిని, సంయుక్త మేనన్, శ్రీనిధి శెట్టి, పవిత్ర గౌడ.. ఇలా ఎందరో సినీ తారలు ఇప్పటికే కుంభమేళాను దర్శించుకున్నారు. తాజాగా మరో టాలీవుడ్ హీరోయిన్ బింధు మాధవి మహా కుంభమేళాలో తళుక్కుమంది. తన కుటుంబ సభ్యులతో కలిసి పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించింది. అనంతరం తన మహా కుంభమేళ యాత్ర ఫొటోలను, వీడియోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

మదన పల్లెకు చెందిన బిందు మాధవి ఆవకాయ్ బిర్యానీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆతర్వాత బంపరాఫర్, ఇంకోసారి, రామ రామ కృష్ణ కృష్ణ, పిల్ల జమీందార్ తదితర తెలుగు హిట్ సినిమాల్లో నటించింది. ఇక తమిళంలోనూ పలు సినిమాల్లో కథానాయికగా నటించి మెప్పించిందీ అందాల తార. యాంగర్ టేల్స్, న్యూసెన్స్, మ్యాన్షన్ 24, పరువు వెబ్ సిరీస్ లతో ఓటీటీ ఆడియెన్స్ నూ మెప్పించింది.

ఇవి కూడా చదవండి

మహా కుంభమేళాలో బింధు మాధవి..

బిందు మాధవి 2002లో బిగ్ బాస్ తెలుగు నాన్ స్టాప్ ఓటీటీ రియాలిటీ షోలో పాల్గొని విజేతగా నిలిచింది. ఇక సోషల్ మీడియాలో నూ ఈ ముద్దుగుమ్మకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

కాశీ యాత్ర లో బింధు మాధవి..

గంగోత్రిలో బిగ్ బాస్ బ్యూటీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి లేడీ డాన్‌గా.. కట్ చేస్తే పోలీసుల..
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి లేడీ డాన్‌గా.. కట్ చేస్తే పోలీసుల..