శుక్రవారమే ‘రంగ్ దే’ గ్రాండ్ రిలీజ్.. అందమైన పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్.. మరీ ఈసారైన నితిన్ హిట్ కొడతాడా ?

Nithiin Rang De Movie: 'జయం' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు నితిన్. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు

శుక్రవారమే 'రంగ్ దే' గ్రాండ్ రిలీజ్.. అందమైన పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్.. మరీ ఈసారైన నితిన్ హిట్ కొడతాడా ?
Rang De
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 25, 2021 | 9:07 PM

Nithiin Rang De Movie: ‘జయం’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు నితిన్. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు ఈ యంగ్ హీరో. ఆ తర్వాత నితిన్ కెరీర్‏లో లవర్ బాయ్‏గా ఎన్నో చిత్రాల్లో నటించాడు. అయితే అందులో కొన్ని సూపర్ హిట్‏గా సాధించగా.. మరికొని డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. ఇక కొన్నెళ్ళు సరైన హిట్ లేకుండా.. కేవలం ప్లాపులతోనే నెట్టుకోస్తున్న నితిన్‏కు సరైన బ్రేక్ ఇచ్చింది ఇష్క్. 2012లో డైరెక్టర్ విక్రమ్ కుమార్ తెరకెక్కించిన ఈ మూవీ నితిన్ కెరీర్‏ను ఒక్కసారిగా మలుపు తిప్పింది. ఈ సూపర్ హిట్ మూవీ తర్వాత నితిన్‏కు మళ్లీ అవకాశాలు క్యూ కట్టాయి. ఈ సినిమా తర్వాత 2013లో వచ్చిన గుండెజారీ గల్లంతయ్యిందే సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వచ్చిన చిన్నదాన నీకోసం సినిమా ఆశించినంతగా సక్సెస్ కాలేదు కానీ నితిన్ నటనకు మాత్రం మంచి గుర్తింపే లభించింది. ఈ మూవీస్ తర్వాత త్రివిక్రమ్ తెరకెక్కించిన అఆ మూవీతో నితిన్ ఖాతాలో మరో సూపర్ హిట్ వచ్చి చేరింది.

ఆ తర్వాత వచ్చిన లై అంతగా హిట్ కాలేకపోయింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‏గా వచ్చిన శ్రీనివాస కళ్యాణం కాస్తా పర్వలేదు అనేలా ఉంది. ఇక భీష్మ సినిమాతో మళ్లీ దారిలోకి వచ్చాడు ఈ యంగ్ హీరో. ఇక లవ్ స్టోరీ సినిమాలు కాకుండా.. విభిన్నంగా ట్రై చేద్దాం అనుకున్న నితిన్ ఆలోచనతో వచ్చిన చెక్ సినిమా బెడిసికొట్టింది. విభిన్నంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్‎ను చెక్ మూవీతో ఆకట్టుకోవడంలో విఫలమయ్యాడు. ప్రస్తుతం కలర్ ఫుల్‏గా ‘రంగ్ దే’తో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు నితిన్. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‏గా తెరకెక్కిన ఈ సినిమాలో నితిన్‏కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది. వెంకీ అట్లూరీ దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన ఈ మూవీ టీజర్, పోస్టర్స్‏తోపాటు ట్రైలర్‏కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ చిత్ర ప్రమోషన్స్‏ కూడా నితిన్ విభిన్నంగా ప్లాన్ చేసింది. ఇప్పటివరకు రకారకాల వీడియోలతో సోషల్ మీడియాలో ప్రేక్షకులను రంగ్ దే మూవీపై ఫోకస్ పెట్టేలా చేయడంలో నితిన్ టీం సక్సెస్ అయ్యిందనే చెప్పుకోవాలి. ట్రైలర్‏లో చూపించినట్టే నితిన్, కీర్తి సురేష్ రియల్ లైఫ్‏లో టామ్ అండ్ జెర్రీల మాదిరిగా ప్రవర్తిస్తూ వీడియోస్ పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇకపోతే.. హోలీ ముందుగానే సినీ ప్రియులకు కలర్ ఫుల్‏ వినోదాన్ని అందించేందుకు రంగ్ దే టీం రేపు (మార్చి 26న) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరీ ఈ సినిమాతో నితిన్ మరో హిట్ అందుకుంటాడా ? లేదా ? అనేది చూడాలి.

Also Read:

కీర్తి వల్ల మా బతుకే బస్టాండ్ అంటున్న నితిన్ టీం.. బాధలు చెప్పుకుంటున్న దేవి శ్రీ.. ఇంతకీ ఏం చేసిందంటే..

Allu Arjun: తన ఫెవరేట్ హీరోయిన్ ఎవరో చెప్పిన బన్నీ డాటర్.. కానీ అంతలోనే మార్చేసిందిగా.. వీడియో వైరల్..