Kushi: ఆకట్టుకుంటున్న ఖుషి టైటిల్ సాంగ్.. సోషల్ మీడియాలో దూసుకుపోతున్న సాంగ్
శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటిస్తుంది. శివ తెరకెక్కించిన టాక్ జగదీశ్ సినిమా నిరాశపరిచిన విషయం తెలిసిందే.. దాంతో ఇప్పుడు ఖుషి సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసిమీద ఉన్నాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. అందమైన ప్రేమ కథగా తెరకెక్కుతోన్న ఈ సినిమానుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఖుషి. లైగర్ సినిమా తర్వాత విజయ్ చేస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటిస్తుంది. శివ తెరకెక్కించిన టాక్ జగదీశ్ సినిమా నిరాశపరిచిన విషయం తెలిసిందే.. దాంతో ఇప్పుడు ఖుషి సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసిమీద ఉన్నాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. అందమైన ప్రేమ కథగా తెరకెక్కుతోన్న ఈ సినిమానుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఖుషి మూవీ సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఖుషి సినిమా నుంచి వచ్చిన ఈ నయా మెలోడీ ప్రేక్షకులను అలరిస్తుంది.
ఖుషి సినిమానుంచి ఇప్పటికే విడుదలైన నా రోజా నువ్వే సాంగ్ వంద మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే ఈపాట ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లో మారుమ్రోగిపోయింది. అలాగే రెండో సాంగ్ ఆరాధ్య కూడా మంచి వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు విడుదలైన ఖుషి టైటిల్ సాంగ్ కూడా ఆకట్టుకుంటుంది.
హిషామ్ అబ్దుల్ వాహబ్ అందించిన బాణీ ఆకట్టుకోగా.. ఈ సాంగ్ కు దర్శకుడు శివ నిర్వాణ సాహిత్యం అందించాడు. ఇప్పుడు ఈసాంగ్ యూట్యూబ్ లో సెన్సేషన్ గా మారిపోయింది. ఇక ఖుషి సినిమాను సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఖుషి తమిళ్, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.




