Suriya: సూర్య సినిమాను కొత్త తలనొప్పి .. కార్తీక్ సుబ్బురాజ్ మూవీకి టైటిల్ టెన్షన్

కంగువా చిత్రం తర్వాత “పూరణనూరు” సినిమాలో నటించాల్సి ఉంది కానీ సూర్య కొన్ని కారణాల వల్ల ఆ సినిమా నుంచి తప్పుకున్నాడని తెలుస్తోంది. ఆ తర్వాత దర్శకుడు కార్తీక్ సుబ్బురాజ్‌తో కలిసి సూర్య 44 చేస్తున్నాడు.

Suriya: సూర్య సినిమాను కొత్త తలనొప్పి .. కార్తీక్ సుబ్బురాజ్ మూవీకి టైటిల్ టెన్షన్
Surya
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 30, 2024 | 10:25 AM

స్టార్ హీరో సూర్య రీసెంట్ గా కంగువ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా నిరాశపరిచింది. ఈ సినిమాలో సూర్య రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించాడు. ఇక ఈ సినిమా తర్వాత తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో సూర్య సరసన పూజా హెగ్డే నటిస్తోంది. కంగువా చిత్రం తర్వాత “పూరణనూరు” సినిమాలో నటించాల్సి ఉంది కానీ సూర్య కొన్ని కారణాల వల్ల ఆ సినిమా నుంచి తప్పుకున్నాడని తెలుస్తోంది. ఆ తర్వాత దర్శకుడు కార్తీక్ సుబ్బురాజ్‌తో కలిసి సూర్య 44 చేస్తున్నాడు. మ్యూజిక్ కంపోజర్ సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

ఒక్క సినిమా కూడా చేయలేదు.. కానీ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది ఈ చిన్నది

ఈ చిత్రాన్ని సూర్య 2డి ఎంటర్‌టైన్‌మెంట్, దర్శకుడు కార్తీక్ సుబ్బురాజ్ స్టోన్ బెంచ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకొని చివరి దశకు చేరుకున్న ఈ సినిమా టైటిల్, టీజర్‌ను త్వరలో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ సందర్భంలో సూర్య 44 సినిమా టైటిల్ విషయంలో పెద్ద సమస్య వచ్చింది. ఈ సినిమాకు కల్ట్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

అప్పట్లో అందానికి ఆధార్ కార్డులా ఉండేది.. స్టార్ క్రికెటర్‌తో ఎఫైర్.. కట్ చేస్తే సన్యాసి..

అయితే అథర్వ హీరోగా, తమిళ సినిమాల్లో వర్ధమాన నటుడు దర్శకత్వం  వహిస్తున్న సినిమాకు కూడా కల్ట్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఈ టైటిల్ గురించి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ అథర్వతో మాట్లాడగా ఆయన ఒప్పుకోలేదని తెలుస్తుంది. అథర్వ కల్ట్ అనే టైటిల్ రిజెక్ట్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం దర్శకుడు సూర్య సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో టైటిల్ కోసం ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని 2025 పొంగల్ సందర్భంగా విడుదల చేయాలని భావిస్తున్నారు.

16 ఏళ్లకే ఫేక్ వీడియోలు.. కట్ చేస్తే 18 ఏళ్లకే తోపు హీరోయిన్.. ఎవరంటే..

ఈ సినిమా తర్వాత సూర్య ఇప్పుడు నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య45 చిత్రంలో నటించనున్నాడు. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ నిన్న నవంబర్ 28న కోయంబత్తూరులో ప్రారంభమైంది. నటుడు RJ బాలాజీ వీట్ల విశేశం, మూక్కుట్టి అమ్మన్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలు విడుదలై జనాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత వరుసగా సినిమాలకు దర్శకత్వం వహించడం మొదలుపెట్టాడు. మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సూర్య 45కి సంగీతం అందించబోతున్నారు. ఈ సినిమాలో సూర్యకు జోడీగా త్రిష నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..