Manju Warrier: ఒంటిచేత్తో తుపాకీ కాల్చడం ఆ స్టార్‌ హీరో దగ్గరే నేర్చుకున్నా.. మంజు వారియర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్

వయసు పెరుగుతున్నా వన్నె తగ్గని అందాల తారల్లో మలయాళీ ముద్దుగుమ్మ మంజు వారియర్‌ ఒకరు. కేవలం నటనతోనే కాదు నిర్మాతగా, ప్లే బ్యాక్‌ సింగర్‌గా, క్లాసికల్‌ డ్యాన్సర్‌ గా మల్టీపుల్‌ ట్యాలెంటెడ్‌ యాక్ట్రెస్‌గా గుర్తింపు తెచ్చుకుందీ ముద్దుగుమ్మ.

Manju Warrier: ఒంటిచేత్తో తుపాకీ కాల్చడం ఆ స్టార్‌ హీరో దగ్గరే నేర్చుకున్నా.. మంజు వారియర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్
Manju Warrier
Follow us

|

Updated on: Jan 08, 2023 | 11:21 AM

వయసు పెరుగుతున్నా వన్నె తగ్గని అందాల తారల్లో మలయాళీ ముద్దుగుమ్మ మంజు వారియర్‌ ఒకరు. కేవలం నటనతోనే కాదు నిర్మాతగా, ప్లే బ్యాక్‌ సింగర్‌గా, క్లాసికల్‌ డ్యాన్సర్‌ గా మల్టీపుల్‌ ట్యాలెంటెడ్‌ యాక్ట్రెస్‌గా గుర్తింపు తెచ్చుకుందీ ముద్దుగుమ్మ. మలయాళంలో స్టార్‌ హీరోయిన్‌గా స్టేటస్‌ సొంతం చేసుకున్న ఈ సొగసరి ఇప్పుడు తమిళ్‌లో అజిత్‌ సరసన కనిపించనుంది. అదే తనివు (తెలుగులో తెగింపు). తమిళ్‌లో మంజుకు ఇది రెండో సినిమా మాత్రమే. గతంలో ధనుష్‌ సరసన అసురన్‌లో నటించి పలువురి ప్రశంసలు అందుకుంది. ఈ సందర్భంగా తుణివు సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్న మంజు అజిత్‌తో కలిసి స్ర్కీన్‌ షేర్‌ చేసుకోవడంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ ఇంతకు ముందు ధనుష్‌తో కలిసి అసురన్‌ చిత్రంలో చేసిన పాత్రకు.. తణివు చిత్రంలో క్యారెక్టర్‌కు అసలు పాత్రే ఉండదు. ఇందులో అజిత్‌ సార్‌ పక్కన యాక్షన్‌ హీరోయిన్‌గా నటించాను. ఈ సినిమాలో కణ్మణి అనే యువతిగా కనిపిస్తాను. యాక్షన్‌ సీక్వెన్స్‌లో భాగంగా ఒక చేతితో తుపాకీ కాల్చడం నాకు చాలా కష్టమైంది. ఆ సమయంలో హీరో అజిత్‌ సహకరించారు. ఒంటిచేత్తో గన్‌ కాల్పడం నేర్పించారు. నేను ఇంతకు ముందు పలు సినిమాల్లో నటించాను. కానీ యాక్షన్‌ సినిమాలో నటించడం ఇదే మొదటిసారి. కథ నచ్చడంతోనే ఇందులో నటించడానికి అంగీకరించాను. అసురన్‌ సినిమాలోని పచ్చయమ్మాళ్‌ పాత్రను ఎలా రిసీవ్‌ చేసుకున్నారో తనివు చిత్రంలోని కణ్మణి క్యారెక్టర్‌కు కూడా అలాగే గుర్తింపు వస్తుందని భావిస్తున్నా’ అని మంజు చెప్పుకొచ్చింది.

అజిత్‌ హీరోగా నటించిన తుణివు సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మంజు వారియర్‌ హీరోయిన్‌గా నటించగా సముద్రఖని, జాన్‌ కొక్కెన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గతంలో ఖాకీ, నెర్కొండ పార్వై, వలిమై లాంటి హిట్‌ చిత్రాలను తెరకెక్కించిన హెచ్‌ వినోద్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. జీ సినిమాతో కలిసి ప్రముఖ నిర్మాత బోనీకపూర్‌ ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ను రూపొందించారు. జిబ్రాన్‌ స్వరాలు సమకూర్చారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్లకు ఓ రేంజ్‌లో రెస్పాన్స్‌ వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.