3 కొత్త మూవీస్, రూ. 40 మాత్రమే..నిఖిల్‌కు ఊహించని అనుభవం

యంగ్ హీరో నిఖిల్ వరుస విజయాలతో మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. కానీ ఇటీవల కాలంలో ఈ క్రేజీ హీరో కెరీర్ కాస్త స్లో అయ్యింది. ‘కేశవ’ ‘కిర్రాక్ పార్టీ’ లాంటి పరాజయాలు నిఖిల్‌ను  ఇబ్బందిపెట్టాయి. వీటి తర్వాత అనేక ఆటంకాల అనంతరం  ‘అర్జున్‌ సురవరం’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమాకు మంచి హిట్ టాక్ వచ్చింది. నిఖిల్ ఫుల్ జోష్‌లో సక్సెస్ టూర్‌లో ఉన్నాడు. విజయయాత్రలో భాగంగా గుంటూరు వెళ్లివస్తోన్న నిఖిల్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. […]

3 కొత్త మూవీస్, రూ. 40 మాత్రమే..నిఖిల్‌కు ఊహించని అనుభవం
Follow us

|

Updated on: Dec 08, 2019 | 4:36 PM

యంగ్ హీరో నిఖిల్ వరుస విజయాలతో మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. కానీ ఇటీవల కాలంలో ఈ క్రేజీ హీరో కెరీర్ కాస్త స్లో అయ్యింది. ‘కేశవ’ ‘కిర్రాక్ పార్టీ’ లాంటి పరాజయాలు నిఖిల్‌ను  ఇబ్బందిపెట్టాయి. వీటి తర్వాత అనేక ఆటంకాల అనంతరం  ‘అర్జున్‌ సురవరం’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమాకు మంచి హిట్ టాక్ వచ్చింది. నిఖిల్ ఫుల్ జోష్‌లో సక్సెస్ టూర్‌లో ఉన్నాడు.

విజయయాత్రలో భాగంగా గుంటూరు వెళ్లివస్తోన్న నిఖిల్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. మధ్యలో రిఫ్రెష్‌మెంట్ కోసం ఓ ఛాయ్ దుకాణం వద్ద కారు ఆపాడు. టీ తాగుతున్న సమయంలో పక్కనే సిడీలు అమ్ముతోన్న బండివైపు నిఖిల్ దృష్టి పడింది. అక్కడికి వెళ్లి చూసి కంగుతిన్నాడు.  తన తాజా సినిమా ‘అర్జున్‌ సురవరం’ పైరసీ సీడీలను, రోడ్డు పక్కన పల్లీలు అమ్మినట్టు అమ్మడం చూసి షాక్‌కి గురయ్యాడు. వాటిని అమ్మే మహిళను హీరో ప్రశ్నించగా, కుటుంబం ఆర్థిక కష్టాల్లో ఉందని, పొట్టకూటి కోసం ఇలా చేస్తున్నామని చెప్పడంతో నిఖిల్‌కు కన్ఫూజన్‌లో ఏం చెయ్యాలో అర్థం కాలేదు. వాటిని తీసుకెళ్లి కారులో పెట్టి క్రాస్ చెక్ చెయ్యగా, అవి ప్లే అయ్యాయి.  ఒక సీడీలో మూడు ఇటీవల రిలీజయిన సినిమాలు ఉంచి, ఒక్కో సీడీ 40 రూపాయల చొప్పున అమ్మకాలు జరుపుతున్నారు.  ఇలాంటివారు ఉంటూనే ఉంటారని, దయచేసి పైరసీని ఎంకరేజ్ చెయ్యకుండా థియేటర్‌కి వెళ్లి సినిమాలు చూడాలని నిఖిల్ ప్రేక్షకులను కోరాడు.