AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: మీరు చాలా రేర్ సార్… తన ఇంట్లో చొరబడ్డ దొంగలకు డబ్బు సాయం చేసిన టాలీవుడ్ నటుడు

ఇప్పుడు మేము చెప్పబోయే నటుడి ప్రవర్తన చాలా విభిన్నం. ఆయన ఆలోచన తీరు.. చాలా ఫార్వార్డ్ ఉంటుంది. ఎప్పుడూ ముక్కుసూటితనంతో ఉంటారు. ఇక ఆయన ఇతరులకు హెల్ప్ చేయడంలో సంతృప్తి వెతుక్కుంటారు. ఇంతకీ ఎవరా నటుడు..? ఆయన గురించి ఓ ఇంట్రస్టింగ్ స్టోరీ మీ కోసం....

Tollywood: మీరు చాలా రేర్ సార్...  తన ఇంట్లో చొరబడ్డ దొంగలకు డబ్బు సాయం చేసిన టాలీవుడ్ నటుడు
Tolllywood News
Ram Naramaneni
|

Updated on: Jul 28, 2025 | 2:58 PM

Share

జగపతి బాబు.. ఒకప్పుడు హీరోగా చేసి,, ఇప్పుడు క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన విషయం తెలిసిందే. అభిమానులు ఆయన్ను జగ్గు భాయ్ అని పిలుచుకుంటూ ఉంటారు. ఆయన ఎంతటి ట్యాలెంటెడ్ యాక్టర్ అనేది అందరికీ తెలుసు. బయట కూడా ఆయన క్యారెక్టర్ చాలా హుందాగా ఉంటుంది. ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడతారు. ఎలాంటి ఫిల్టర్ ఉండదు. ఏ విషయం అయినా సరే తన ఒపినియన్ చెప్పేస్తారు. ఆయన ఆలోచన ధోరణి కూడా చాలా పరిణితితో ఉంటుంది. కులు జాడ్యం గురించి జగపతిబాబు చాలా గట్టిగానే వాయిస్ వినిపిస్తారు. తన సినీ, పర్సనల్ లైఫ్‌లలోని ఎత్తుపల్లాల గురించి కూడా ఓపెన్‌గా చెప్పేస్తారు. బయటకు ఎక్కడికి వెళ్లినా అందరి బిల్స్ తనే కట్టడం జగపతిబాబుకి ఉన్న వీక్‌నెస్. సినిమాలు తేడా కొట్టినప్పుడు ప్రొడ్యూసర్స్‌కు రెమ్యూనరేషన్ డబ్బు వెనక్కి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఎవరైనా హెల్ప్ అంటే చాలు ఆయన కరిగిపోయి.. అడిగినంత ఇచ్చేస్తారు.

ఆయన మెంటాలిటీ గురించి వివరించాలంటే.. మీకు ఓ ఘటన గురించి చెప్పాలి. జగపతి బాబు నివాసంలో ఓ సారి దొంగల పడ్డారు. పోలీసులు వాళ్లను పట్టుకుని కేసు పెట్టి జైలుకు పంపారు. ఆ తర్వాత దొంగల భార్యలు జగపతిబాబుకు ఫోన్ చేశారట. పిల్లలతో తాము రోడ్డున పడ్డామని బోరున విలపించారట. దీంతో ఆ దొంగల కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు జగపతి బాబు. అది కూడా ఒకసారి చేసి చేతులు దులుపుకోలేదు.. దొంగలు జైలు నుంచి విడుదల అయ్యేంతవరకు వారి కుటుంబాలకు నెల నెలా వారికి డబ్బు పంపుతూనే ఉన్నారట. ఈ విషయాన్ని తానే ఓ ఇంటర్య్వూలో చెప్పారు జగపతిబాబు. దీంతో ఈయనేంట్రా బాబు.. మరీ ఇంత మంచోడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.

View this post on Instagram

A post shared by Jaggu Bhai (@iamjaggubhai_)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.