Pooja Hegde: మహేష్ సినిమా నుంచి పూజా హెగ్డే అందుకే తప్పుకుందట.. అసలు విషయం ఏంటంటే
ఈ సినిమాలో హీరోయిన్స్ గా పూజా హెగ్డే తో పాటు శ్రీలీల ను ఎంపిక చేశారు. అయితే మూవీ నుంచి పూజాహెగ్డే తప్పుకున్నారని గత కొద్దీ రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమానుంచి పూజా నిజంగానే తప్పుకున్నారా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది.
త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా గుంటూరు కారం. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్స్ గా పూజా హెగ్డే తో పాటు శ్రీలీల ను ఎంపిక చేశారు. అయితే మూవీ నుంచి పూజాహెగ్డే తప్పుకున్నారని గత కొద్దీ రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమానుంచి పూజా నిజంగానే తప్పుకున్నారా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. పూజా తప్పుకోవడంతో ఇప్పుడు ఆమె ప్లేస్ లోకి మరో హీరోయిన్ ను తీసుకున్నారట. మహేష్ తో గతంలో మహర్షి సినిమాలో నటించింది పూజా అయితే ఇప్పుడు ఈ మూవీ నుంచి తాను తప్పుకోవడానికి కారణం ఏంటి అని అందరు అనుకుంటున్నారు.
అయితే గుంటూరు కారం సినిమాలో ఆమె పాత్ర చాలా తక్కువ ఉంటుందని. ప్రాధాన్యత కూడా అంతగా ఉండదని. శ్రీలీలకు ఎక్కువ స్కోప్ ఉండటంతో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారని వార్తలు వచ్చాయి.కానీ ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది.
ఈ మూవీ షూటింగ్ కు ఎప్పటికప్పుడు బ్రేక్ పడుతూ వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా చాలా ఆలస్యం అయ్యింది. దాంతో పూజ హెగ్డేకు డేట్స్ విషయంలో సమస్య ఎదురవుతుందట. డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడమతొ పూజ ఈ సినిమానుంచి తప్పుకుందని అంటున్నారు ఆమె సన్నిహితులు. పూజ తప్పుకోవడమతో శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా చేశారట గురూజీ. ఇక సెకండ్ హీరోయిన్ గా సంయుక్త మీనన్ ను తీసుకుంటున్నారని తెలుస్తుంది.