Krishna: తన కూతురు పెళ్లికి రావొద్దని ఏకంగా సీఎం‏కే కాల్ చెప్పిన కృష్ణ.. కారణమెంటో తెలుసా..

ఫిలింనగర్ మహాప్రస్థానంలో అధికార లాంఛనాలతో కృష్ణ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. గౌరవసూచకంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపాక మహేష్ చితికి నిప్పంటించారు.

Krishna: తన కూతురు పెళ్లికి రావొద్దని ఏకంగా సీఎం‏కే కాల్ చెప్పిన కృష్ణ.. కారణమెంటో తెలుసా..
Krishna
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 17, 2022 | 10:45 AM

నటశేఖరుడు, లెజెండ్‌, సూపర్‌ స్టార్‌ కృష్ణకు కన్నీటి వేడ్కోలు పలికింది తెలుగు నేల. మంగళవారం తెల్లవారుఝామున కృష్ణ కన్నుమూయగా.. బుదవారం సాయంత్రం వందలాది మంది అభిమానుల మధ్య అంత్యక్రియలు జరిగాయి. ఫిలింనగర్ మహాప్రస్థానంలో అధికార లాంఛనాలతో కృష్ణ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. గౌరవసూచకంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపాక మహేష్ చితికి నిప్పంటించారు. అంతకు ముందు పద్మాలయ స్టూడియో నుంచి అంతిమ యాత్ర మహాప్రస్థానం దాకా సాగింది. దారి పొడవునా సహచర నటులు, బంధుమిత్రులు, ఫ్యాన్స్‌ తరలి వచ్చారు. సూపర్‌ స్టార్‌ పార్ధివ దేహాన్ని చూసి కంటతడి పెట్టుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో కృష్ణ అధ్యాయం ప్రత్యేకం.. సాహాసాలకు ఆయన పెట్టింది పేరు. సినిమాలే కాదు.. అనేక అంశాల్లోనూ ఎంతో దైర్యంగా.. నిశితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవారు. తన కూతురు వివాహానికి వచ్చేందుకు సిద్ధమైన ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫోన్ చేసి.. మీరు పెళ్లికి రావొద్దు అని నిర్మోహ్మాటంగా చెప్పేశారట కృష్ణ. అయితే అందుకు ఆ సీఎం కూడా నవ్వి ఊరుకున్నారట. ఇంతకీ ఆ ముఖ్యమంత్రి ఎవరు ?.. కృష్ణ ఎందుకు రావొద్దు ? అని చెప్పారో తెలుసుకుందామా.

ఆ సీఎం ఎవరో కాదు.. ముఖ్యమంత్రి జయలలిత. అన్ని విషయాల్లో కచ్చితంగా ఉండే జయలలిత.. కృష్ణ ఫోన్ చేసి రావొద్దు అని చెప్పగానే కోప్పడలేదట. సరదాగా నవ్వినట్లు ఓ ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా చెప్పారు. కృష్ణ పెద్ద కుమార్తె పద్మావతి వివాహం గల్లా జయదేవ్‏ తో నిర్ణయించారు. చెన్నైలో ఆడంబరంగా చేసిన ఆ పెళ్లికి ఏపిలోని రాజకీయ ప్రముఖులతోపాటు.. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం జయలలితను కూడా ఆహ్వనించారట. వీరిద్దరి కాంబోలో గూఢాచారి 116, నిలుపు దోపిడి సినిమాలు వచ్చాయి. దీంతో ఆమె వివాహనికి తప్పకుండా వస్తాను అని చెప్పారట. అయితే పెళ్లికి మూడు రోజుల ముందు కృష్ణ ఇంటికి వచ్చిన జయలలిత సెక్యూరిటీ ఆఫీసర్ ఓ రిక్వెస్ట్ చేశారట.

ఇవి కూడా చదవండి

పెళ్లికి సీఎం వస్తున్నారని ..సెక్యూరిటీ రీజన్స్ కారణంగా జయలలిత.. ఆమెతోపాటు వచ్చే వారి కోసం మండపంలో తొలి మూడు వరుసలు సీట్లని కేటాయించాలని కోరారట. కానీ అందుకు కృష్ణ ఒప్పుకోలేదట. అప్పటికే ఉమ్మడి ఏపీలో ని సీని, రాజకీయ ప్రముఖులను ఆహ్వనించామని.. వారిని పక్కన పెట్టి కేవలం సీఎం కోసం మూడు వరుసలు వదలడం కుదరదని.. ఇదే విషయాన్ని స్వయంగా జయలలితకు కాల్ చేసి చెప్పారట. దీంతో ఆమె నవ్వి ఊరుకున్నారట.

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.