ఉదయం అల్పాహారం ఎక్కువగా తినకూడదు. లైట్‌గా తీసుకోవాలి. ముఖ్యంగా అల్పాహారంలో తృణధాన్యాలు తినడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే దీన్ని తీసుకోవడం ద్వారా చాలా వరకు బరువు తగ్గవచ్చు. నట్స్‌లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రోజంతా కుడపు నిండుగా ఉంచుతుంది. ఫలితంగా ఎక్కువ ఆకలి అనిపించదు. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అందుకే అల్పాహారంలో బాదం, వాల్‌నట్‌లు, జీడిపప్పు, ఎండుద్రాక్షలను చేర్చుకోవచ్చు.