ఆ చీర మురిసిపోదా ఈమె స్పర్శ తాకి.. మెస్మరైజ్ వాణి.. 

29 December 2024

Battula Prudvi

30 మే 1992న భారతదేశ రాజధాని నగరం ఢిల్లీలో ముఖేష్ మిశ్రా, సవితా మిశ్రా దంపతులకు జన్మించింది అవంతిక మిశ్రా.

ఈ వయ్యారి తండ్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పని చేసారు. ఈమెకు అగ్నివేష్ మిశ్రా అనే తమ్ముడు కూడా ఉన్నాడు.

బెంగుళూరులోని ఎయిర్ ఫోర్స్ గోల్డెన్ జూబ్లీ ఇన్‌స్టిట్యూట్ మరియు కె వి హెబ్బాల్‌లో పాఠశాల విద్య పూర్తిచేసింది.

కర్ణాటక రాజధాని బెంగుళూరులో BMS కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి కెమికల్ ఇంజనీరింగ్ పట్టా పొందింది ఈ బ్యూటీ.

ప్యూమా, ఫెమినా మరియు అనేక ఇతర బ్రాండ్‌లకు మోడల్‌గా తన కెరీర్ ప్రారంభించింది వయ్యారి భామ అవంతిక మిశ్రా.

మోడలింగ్ అసైన్‌మెంట్‌ల కోసం చాలా ప్రదేశాలు తిరిగింది. అదే ఈమెకు చలనచిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాలనే విశ్వాసాన్ని ఇచ్చింది.

2014లో మాయ అనే తెలుగు సూపర్ నాచురల్ థ్రిల్లర్ చిత్రంతో కథానాయకిగా చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ.

తర్వాత మీకు మీరే మాకు మేమే, వైశాఖం చిత్రాల్లో కథానాయకిగా చేసింది. మీకు మాత్రమే చెప్తా, భీష్మలో అతిథి పాత్రలో మెప్పించింది.